Friday, 29 August 2014

సినిమా రివ్యూ: రభస

ప్లస్ పాయింట్స్:
జూనియర్ ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్
సమంత, ప్రణీత గ్లామర్,
బ్రహ్మానందం కామెడీ
 
మైనస్ పాయింట్స్:
రొటిన్ కథ, పేలవమైన కథనం
మితిమీరిన ఫైట్స్
 
ఓ అమ్మాయి ప్రేమను కాపాడే పయత్నంలో మరో అమ్మాయి పెళ్లి ఆగిపోవడానికి కారణమవుతాడు కార్తీక్(జూనియర్ ఎన్టీఆర్). తన తండ్రి(నాజర్) అవమానించిన తన మేనమామ ధనుంజయ్ (షియాజీ షిండే) బుద్ది చెప్పి, తన తల్లి కోరిక మేరకు తన మరదలు చిట్టి అలియాస్ ఇందు(సమంత)ను పెళ్లి చేసుకోవాలని హైదరాబాద్ చేరుకుంటారు. తన మరదలు అని తెలియకపోవడంతో మొదటి కలయికలోనే ఇందు,కార్తీక్ ల మధ్య విభేదాలు చోటు చేసుకుంటాయి. తన మరదలిని ప్రేమలోకి దించే ప్రయత్నంలో భాగ్యం(ప్రణితి)ను ఇందుగా భావించి ప్రేమలోకి దింపుతాడు. కార్తీక్ చెడ్డవాడు అనే భావనలో ఉన్న ఇందు..వారిద్దరి విడగొడుతుంది. భాగ్యంతో ప్రేమను విడగొట్టిన ఇందు అప్పటికే తనకు తెలియని వ్యక్తితో ప్రేమలో పడుతుంది. తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్న తన తండ్రి ప్రయత్నాలకు దూరంగా పారిపోవడానికి కార్తీక్ తో ప్రేమలో ఉన్నట్టు నాటకం ఆడుతుంది. కథ ఇలా నడుస్తుండగా.. పెద్దిరెడ్డి (జయప్రకాశ్) ఓబుల్ రెడ్డి (అజయ్)ల గ్యాంగ్ కార్తీక్ కోసం వెదుకుతుంటారు. ఓదశలో కార్తీక్, ఇందులు పెద్దిరెడ్డి ఇంట్లోకే చేరుతారు. తనను వెతుకున్న విలన్ల ఇంటికి చేరిన కార్తీక్ ఏం చేశాడు. ఇందు తన మరదలే అని తెలుసుకున్నాడా? తెలియని వ్యక్తితో ప్రేమలో పడిన ఇందు తన ప్రేమికుడిని కలుసుకుందా? పెద్దిరెడ్డి, ఓబుల్ రెడ్డిలు కార్తీక్ ను ఎందుకు వెతుకుతున్నారు? అయితే ఇందు తన మరదలు అని తెలుసుకుంటాడా? తన కారణంగా ఓ అమ్మాయి పెళ్లి ఆగిపోయిందని తెలుసుకున్న కార్తీక్ ఏం చేశాడు? తన మామ ధనుంజయ్ ను ఎలా కన్విన్స్ చేసి ఇందును పెళ్లి చేసుకున్నాడా? అనే పలు ప్రశ్నలకు సమాధానమే 'రభస'
 
 
ప్రేమికుడిగా, ఆపదలో ఉన్న వారిని ఆదుకునే ఓ వ్యక్తిగా, తన తల్లిని మాటను తీర్చే కోడుకుగా, పగ ప్రతీకారంతో రగిలిపోతున్న రెండు ఫ్యాక్షన్ల కుటుంబాలను కలిపే మనసున్న మనిషిగా, తన మేనమామకు తగిన గుణపాఠం నేర్పే అల్లుడిగా.. పలు విభిన్న షేడ్స్ ఉన్న కార్తీక్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించడమే కాకుండా పూర్తిగా న్యాయం చేశాడు. గత కొద్దికాలంగా సరైన హిట్ లేని.. జూనియర్ ఎన్టీఆర్.. ప్రయోగాలకు చోటివ్వకుండా చాలా సేఫ్ గా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఎప్పటిలానే ఫైట్స్, డ్యాన్స్, అభినయం, ఎమోషనల్ సీన్లలో మెప్పించాడు. 
 
సమంత పాత్ర ప్రధానంగా గ్లామర్ కే పరిమితమైన, కీలక సన్నివేశాల్లో పర్వాలేదనిపించింది. ప్రణీత రెండో హీరోయిన్ గా కనిపించి.. కథానుగుణంగా కనిపించి మాయమవుతుంది. ప్రణీత కెరీర్ కు పెద్గగా ప్లస్ అవుతుందని చెప్పడం కష్టమే. 
 
రాజు పాత్రలో కనిపించిన బ్రహ్మనందం రోటిన్ కారెక్టర్ అయినప్పటికి.. ద్వితీయార్ధంలో సినిమా భారాన్ని తనపైనే వేసుకున్నాడు.  ఫైట్స్ తో విసిగించే సమయంలో రాజుగా ఎంట్రీ ఇచ్చి.. ప్రేక్షకులకు బ్రహ్మనందం కొంత రిలీఫ్ కలిగించాడు. 
 
జయప్రకాశ్, నాగినీడు, అజయ్, షియాజీ షిండే, నాజర్, జయసుధలు తమ పాత్రల పరిధిమేరకు పర్వాలేదనిపించారు. 
 
సాంకేతిక నిపుణులు పనితీరు:
సాంకేతిక విభాగంలో ముఖ్యంగా శ్యామ్ కే నాయుడును అందించిన ఫోటోగ్రఫి బాగుంది. లోకేషన్లు ఆందంగా చిత్రీకరించి.. రభసకు అదనపు ఆకర్షణగా మారారు. ఈ చిత్ర నిడివి సుమారు 2 గంటల 40 నిమిషాలకు పైనే ఉంది. ఎడిటింగ్ విభాగంలో కోటగిరి వెంకటేశ్వరరావు మరింత పదను పెట్టాల్సిందే. ఓ రెండు పాటలు మినహా తమన్ ప్రభావవంతమైన సంగీతాన్ని అందించలేదనే చెప్పవచ్చు. ఎమోషన్ సీన్స్ లో నేపథ్యం సంగీతంగా అంతగా ఆకట్టుకునే విధంగా లేదనిపిస్తోంది. 
 
'కందిరీగ' చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన సంతోష్ శ్రీనివాస్ రభస కథ, కథనాన్ని చాలా కాంప్లికేటెడ్ పంథాలోనే కొనసాగించాడు. అనేక ట్విస్టులు, గందరగోళంగా ఉండే కథనంతో ప్రేక్షకుడిని అక్కడక్కడా కన్ ఫ్యూజ్ చేస్తుంది. కథాగమనంలో అనేక మలుపులు సహజంగా ఉన్నట్టు ఎక్కడా అనిపించదు. కేవలం కమర్షియల్ ఆంశాలను బేరిజు వేసుకుని కథ, కథనంపై దృష్టిపెట్టారనేది సగటు ప్రేక్షకుడికి అర్ధమవుతుంది. అయితే తొలిభాగంలో ఓపెన్ చేసిన ట్విస్టులకు ద్వితీయార్ధంలో క్లోజ్ చేసిన తీరు, విధానాన్ని మెచ్చుకోవాల్సిందే. చిత్ర ద్వితీయార్ధంలో తీసుకున్న కొన్ని జాగ్రత్తలు దర్శకుడి ప్రతిభకు అద్దపడుతుంది. ప్రస్తుత పరిస్థితులకు తగినట్టుగా ఎలాంటి ప్రయోగాలకు చోటివ్వకుండా టాలీవుడ్ సక్సెస్ ఫార్ములాతో కథను పట్టాలెక్కించి.. సేఫ్ గా గమ్యాన్ని చేర్చేందుకు చేసిన ప్రయత్నం కొంత వర్కవుట్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను, సగటు ప్రేక్షకులను ఉర్రూతలూగించే చిత్రంగా కాకుండా.. ఓ రకమైన సంతృప్తిని కలిగించే చిత్రంగా 'రభస' రూపొందింది. బీ,సీ సెంటర్లలో ప్రేక్షకులు ఆదరణపైనే రభస సక్సెస్, కమర్షియల్ గా ఏరేంజ్ లో వర్కవుట్ అయిందనే అంశాలు అధారపడి ఉన్నాయి. 
REVIEW@MEGACREATIONS-G.S.KUMAR

Friday, 1 August 2014

సినిమా రివ్యూ: రన్‌ రాజా రన్‌

రివ్యూ: రన్‌ రాజా రన్‌
 రేటింగ్‌: 3.25/5 
బ్యానర్‌: యు.వి. క్రియేషన్స్‌ 
తారాగణం: శర్వానంద్‌, సీరత్‌ కపూర్‌, సంపత్‌, అడివి శేష్‌, వెన్నెల కిషోర్‌, కోట శ్రీనివాసరావు తదితరులు
 సంగీతం: ఘిబ్రాన్‌ .ఎం 
కూర్పు: మధు 
ఛాయాగ్రహణం: మధి 
నిర్మాతలు: వి. వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి 
రచన, దర్శకత్వం: సుజిత్‌
 విడుదల తేదీ: ఆగస్ట్‌ 1, 2014 
ఆకర్షణీయమైన ప్రోమోలు, పోస్టర్లతో ‘రన్‌ రాజా రన్‌’ సినీ ప్రియుల దృష్టిలో పడింది. టాలెంట్‌ ఉన్నా కానీ అందుకు తగ్గ సక్సెస్‌ సాధించలేకపోతున్న శర్వానంద్‌ ఈసారి కొత్త దర్శకుడు సుజిత్‌తో ‘మిర్చి’ అందించిన నిర్మాణ సంస్థలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. పబ్లిసిటీతో అంచనాలు పెంచిన ఈ రాజా.. స్క్రీన్‌పై ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడో లేదో చూద్దాం.

 కథేంటి? రాజా హరిశ్చంద్రప్రసాద్‌ (శర్వానంద్‌) ప్రేమించిన ప్రతి అమ్మాయి హ్యాండిస్తుంటుంది. చాలా మందిని ప్రేమించి విసిగిపోయిన దశలో అతనికి ప్రియ (సీరత్‌) తారసపడుతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. అయితే ప్రియ ఆ సిటీ పోలీస్‌ కమీషనర్‌ (సంపత్‌) కూతురు. తన కూతురి ప్రేమ విషయం తెలిసిన తర్వాత ఆ కమీషనర్‌ రాజాకి ఎలాంటి పరీక్ష పెట్టాడు? దాంట్లో రాజా ఎలా నెగ్గుకొస్తాడు? 

కళాకారుల పనితీరు:  శర్వానంద్‌ తన పాత్రకి పూర్తి న్యాయం చేసాడు. ఫస్ట్‌ సీన్‌ నుంచి ఎనర్జిటిక్‌గా సాగే ఈ పాత్రలో శర్వానంద్‌ చాలా ఎంటర్‌టైన్‌ చేసాడు. ఎక్కువగా సీరియస్‌ రోల్స్‌ చేసిన శర్వానంద్‌ ఇందులో తన వయసుకి తగిన చలాకీ యువకుడిగా కనిపించాడు. కామెడీ సీన్స్‌లో కూడా మంచి టైమింగ్‌తో అలరించాడు. సీరత్‌ కపూర్‌ బాగానే చేసింది. సంపత్‌ క్యారెక్టరైజేషన్‌ బాగుంది. మరీ వయలెంట్‌గా చూపించకుండా ఈ క్యారెక్టర్‌కి కొంచెం ఫన్నీ టచ్‌ ఇచ్చారు. దాని వల్ల విలన్‌ పాత్ర కూడా వినోదాన్ని పంచుతుంది. అడివి శేష్‌ కీలకమైన క్యారెక్టర్‌ చేసాడు. తన క్యారెక్టర్‌కి అనుగుణంగా బాగా అండర్‌ ప్లే చేసాడు. కోట శ్రీనివాసరావు గురించి కొత్తగా చెప్పేదేముంది. వెన్నెల కిషోర్‌, విద్యుల్లేఖ తదితరులు తమకిచ్చిన క్యారెక్టర్స్‌కి తగ్గట్టు నటించారు.  
సాంకేతిక వర్గం పనితీరు: ఘిబ్రాన్‌ అందించిన సంగీతం సినిమాకి అనుగుణంగా ఉంది. సాంగ్స్‌ ఆడియోలో కంటే స్క్రీన్‌పై ఇంకా బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా సినిమాకి ఎస్సెట్టే. మధి సినిమాటోగ్రఫీ మరో పెద్ద బోనస్‌. స్క్రీన్‌ చాలా వెబ్రెంట్‌గా, కలర్‌ఫుల్‌గా కనిపించింది. సాంగ్స్‌ షూట్‌ చేయడానికి ఎంచుకున్న లొకేషన్లు ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్‌ పర్‌ఫెక్ట్‌గా ఉంది. సినిమాలో ఎక్కడా ల్యాగ్‌ అస్సల్లేదు. చిన్న సినిమా అయినా కానీ నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు. క్వాలిటీ పరంగా రన్‌ రాజా రన్‌ పెద్ద సినిమాలకి తీసిపోని విధంగా తెరకెక్కింది.  డైరెక్టర్‌ సుజిత్‌కి మంచి సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఉంది. రెగ్యులర్‌గా తెలుగు సినిమాల్లో చూసే కామెడీ కాకుండా అతను కొత్త రకంగా వినోదాన్ని పంచాడు. తన క్యారెక్టర్స్‌ అన్నిటినీ క్లియర్‌గా డెవలప్‌ చేసుకున్నాడు. కొత్తవాడైనా కానీ సినిమాని హ్యాండిల్‌ చేయడంలో తడబాటు కనిపించడం లేదు. తాను ఏం తీస్తున్నాననే క్లారిటీ ఉండడం వల్ల ట్విస్టులు వచ్చినపుడు కూడా గందరగోళం లేకుండా స్పష్టంగా కథ చెప్పగలిగాడు. ఇటీవల సక్సెస్‌ అయిన కొత్త దర్శకుల జాబితాలో ఇతనూ చేరతాడు. ఇకపై ఎలాంటి సినిమాలు తీస్తాడనేది ఆసక్తికరం.  
విశ్లేషణ: ‘రన్‌ రాజా రన్‌’ అవుట్‌ అండ్‌ అవుట్‌ ఫన్‌ ఫిలిం. స్టార్ట్‌ టు ఎండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మిస్‌ అవకుండా సరదాగా సాగిపోతుంది. ఏ దశలోను ఈ సినిమా సీరియస్‌గా మారదు. బేసిక్‌గా యాక్షన్‌కి స్కోప్‌ ఎక్కువ ఉన్నా కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా భారీ ఫైట్‌ లేకపోవడం ఈ సినిమా స్పెషాలిటీ. సిట్యువేషన్స్‌ని సింపుల్‌గా, కూల్‌గా ఎలా డీల్‌ చేయాలో దర్శకుడు తన పాత్రల ద్వారా చూపించాడు. క్యారెక్టర్స్‌ని పరిచయం చేయడంతోనే వాటికో ఫన్నీ యాంగిల్‌ కూడా ఇచ్చి సదరు పాత్రలపై సీరియస్‌ ఇంప్రెషన్‌ కలగకుండా చూసుకున్నాడు. ఉదాహరణకి కమీషనర్‌ క్యారెక్టర్‌ మైఖేల్‌ జాక్సన్‌ సాంగ్‌ ప్లే అవుతుంటే డాన్స్‌ వేస్తూ ఇంట్రడ్యూస్‌ అవుతుంది. దాని వల్ల ఆ తర్వాత ఆ పాత్రని కూడా వినోదానికి వాడుకోవడానికి వీలు చిక్కింది. అదే ఈ క్యారెక్టర్‌ని ఏ ఎన్‌కౌంటర్‌ చేస్తున్నట్టో.. ఎవర్నో ఇంటరాగేట్‌ చేస్తున్నట్టో చూపించి ఉంటే.. ఆ తర్వాత ఆ పాత్రని కామెడీగా మలచడం ఇబ్బంది అయ్యేది.  దర్శకుడు ఇలాంటి సింపుల్‌ విషయాలపై శ్రద్ధ పెట్టాడు. ప్రథమార్థం సాఫీగా ఒక రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లా సాగిపోతుంది. ఇంటర్వెల్‌ తర్వాత కథలో సడన్‌ టర్న్‌ వస్తుంది. యాక్షన్‌ పెరుగుతుంది. అయితే ఎంటర్‌టైన్‌మెంట్‌ని మాత్రం ఎక్కడా మిస్‌ అవలేదు. అసలు కథని ప్రీ క్లయిమాక్స్‌లో రివీల్‌ చేస్తారు. ఎంటర్‌టైనర్స్‌ అంటే అసలు కథే లేని డొల్లతనం ఎక్కువవుతోంది. కానీ ఈ చిత్రంలో ఆ లోటు లేకుండా విషయమున్న కథనే రాసుకున్నారు. అయితే ఆ ట్విస్టులు మరీ ఎక్కువయ్యాయేమో అనిపిస్తాయి. ఒక దాని తర్వాత ఒకటిగా చాలా విషయాలు ఒకేసారి రివీల్‌ అయిపోవడం వల్ల కథనం కాసేపు బరువెక్కుతుంది. అయితే మళ్లీ క్లయిమాక్స్‌లో యథాతథంగా ఫన్‌ నింపేసి హ్యాపీగా పంపేసారనుకోండి. ఈ చిత్రం ప్రధానంగా యూత్‌ని, సిటీ ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా ఉంది. మసాలా ఎలిమెంట్స్‌ కానీ, మాస్‌ కోరుకునే అంశాలు కానీ ఇందులో లేవు. కనుక ‘రన్‌ రాజా రన్‌’ మెయిన్‌గా ఏ సెంటర్స్‌కి పరిమితం అయ్యే అవకాశముంది. శర్వానంద్‌కి చాలా కాలంగా దక్కకుండా పోతున్న సక్సెస్‌ ఈసారి రన్‌ రాజాతో కైవసం  అయినట్టే. రొటీన్‌ కామెడీ నుంచి బ్రేక్‌ కోరుకుంటోన్న వారిని, ఒక డిఫరెంట్‌ ఎంటర్‌టైనర్‌ కోరుకునే వారిని ఈ చిత్రం డిజప్పాయింట్‌ చేయదు.  
బోటమ్‌ లైన్‌: ఫన్‌ రాజా ఫన్‌! 
REVIEW @ MEGA CREATIONS-G.S.KUMAR

Friday, 25 July 2014

5వేల థియేటర్లలొ కిక్ ఇవ్వనున్న సల్లూభాయ్

బాలీవుడ్‌ ‘కిక్‌’ ఐదు వేల థియేటర్లలో విడుదల కానుంది. భారతదేశంలోనే అత్యధిక థియేటర్లలో సినిమాని విడుదల చేస్తోన్న చిత్ర నిర్మాతలు, విదేశాల్లోనూ కనీ వినీ ఎరుగని రీతిలో ఈ సినిమాని అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్‌ చేశారు. మామూలుగా అమెరికా తదితర దేశాల్లోనే ఎక్కువగా మన సినిమాలు విడుదలవుతుంటాయి. ఈసారి ‘కిక్‌’ని జర్మనీ, మొరాకో, ఫ్రాన్స్‌, మాల్దీవుల్లోనూ విడుదల చేస్తుండడం గమనార్హం. తెలుగులో రవితేజ, ఇలియానా జంటగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘కిక్‌’ సినిమానే హిందీలో సల్మాన్‌ఖాన్‌ హీరోగా అదే పేరుతో రీమేక్‌ చేసిన విషయం విదితమే. సల్మాన్‌ఖాన్‌ సరసన శ్రీలంక బ్యూటీ జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. భారీ బడ్జెట్‌తో, తెలుగు ‘కిక్‌’ కన్నా పదింతల కిక్‌ ఇచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించారట. సాజిద్‌ నడియడ్‌వాలా ఈ హిందీ ‘కిక్‌’ చిత్రానికి దర్శకుడు. తొలిరోజు, తొలివారం రికార్డుల్ని ఇంకెవరూ ఇప్పట్లో టచ్‌ చేయని రీతిలో ‘కిక్‌’ క్రియేట్‌ చేస్తుందన్నది చిత్ర యూనిట్‌  నమ్మకం. మొత్తం 42 దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండడంతో రికార్డులు ఏ రేంజ్‌లో వుంటారో ఊహించడమే కష్టమని బాలీవుడ్‌ సినీ జనం అనుకుంటున్నారట.

Wednesday, 23 July 2014

Ram Charan to launch Turbo Megha Airlines

 Mega Power Star Ram Charan Tej going to enter into airline business. He already got permission from Union ministry of aviation to run airlines with a name, Turbo Megha. Ram Charan and Vankayalapati Umesh are the directors of this company. Ram Charan's Turbo Megha is one of the eight airlines, which got permissions from the Union government. 

Out of these eight airlines, three airlines run national and international services and the remaining five airlines are regional and they run services in domestic sector. 

Friday, 18 July 2014

రేసుగుర్రం పరుగు నిర్విరామంగా వందరోజులకు చేరుకుంది


అల్లుఅర్జున్ హీరోగా సురేందర్ రెడ్డిగారి దర్శకత్వంలో వచ్చిన రేసుగుర్రం సినిమా నేటితో దిగ్విజయంగా 26 కేంద్రాలలొ వందరోజులు పూర్తి చేసుకుంటుంది అంతె కాకుండా తెలుగు సినిమా పరిశ్రమలొ నాల్గవ స్థానాన్ని సొంతం చేసుకుంది ఇంతటి ఘనవిజయాన్ని అంందించిన రేసుగుర్రం టీమ్ కి  ధన్యవాదాలు  

Thursday, 17 July 2014

రీలీజ్ కి ముందె కనకవర్షం కురుపిస్తున్న చెర్రి

రామ్ చరణ్,కృష్ణ వంశీ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘గోవిందుడు అందరివాడేలే’ . టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రం బిజినెస్ షాకింగ్ కు గురి చేస్తూ ఓ రేంజిలో జరుగుతోంది. ఇప్పటివరకూ ఈ చిత్రం గురించి ఏ విషయం రివిల్ చేయకపోయినా బయ్యిర్లు,డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. రికార్డు రేట్లకు దాదాపు చాలా ఏరియాల బిజినెస్ క్లోజ్ అయిపోయినట్లు సమాచారం. ఈ బిజినెస్ చూసిన వాళ్ళు…అందుకే నిర్మాతలు మెగా హీరోలు వెంట నిర్మాతలు పడతారు అంటున్నారు. ఆ డిస్ట్రిబ్యూటర్స్ లిస్టు ఇదిగో… నైజాం ఏరియా- దిల్ రాజు సీడెడ్ – లక్ష్మీ కాంత్ రెడ్డి వైజాగ్- భరత్ పిక్చర్స్ నెల్లూరు- హరి పిక్చర్స్ 

Monday, 14 July 2014

ఆగష్టు 20న అభిమానుల సమక్షంలో గోవిందుడి పాటల పండుగ


కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న ‘గోవిందుడు అందరి వాడేలే’ చిత్రం ఆడియో వేడుకకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా పాటల పండుగను ఆగస్ట్ 20న హైదరాబాదులో అభిమానుల సమక్షంలో నిర్వహిస్తారు. కాగా, ఈ చిత్రం ట్రైలర్ ను ఈ నెల 28న దర్శకుడు కృష్ణవంశీ జన్మదినం సందర్భంగా రిలీజ్ చేయడానికి నిర్ణయించారు. ఇక షూటింగు విషయానికి వస్తే, ఇప్పటికే చాలా వరకు పూర్తయింది. త్వరలో లండన్ షెడ్యూల్ ను నిర్వహిస్తారు. చరణ్ సరసన కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో చరణ్ తండ్రిగా రెహ్మాన్, తాతగా ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. 

Wednesday, 9 July 2014

రివ్యూ : దృశ్యం

మ‌ల‌యాళంలో ఘ‌న విజ‌యం సాధించిన దృశ్యం చిత్రానికి యాజ్ ఇట్ ఈజ్‌.. రీమేక్ ఈ సినిమా! తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఓ స‌రికొత్త థ్రిల్‌ని ప‌రిచ‌యం చేస్తున్న దృశ్యం.విక్టరీ వెంకటేష్ తాజాగా నటించిన దృశ్యం ఈ నెల 11వ తారీకు విడుదలకు సిద్దమైంది అయితే ఈ చిత్రం ప్రివ్యు షో ఈ రోజు ప్రదర్శించారు చిత్రం ఫస్ట్ హాఫ్ కొంచం లెంత్ ఎక్కువ అయినట్లు అనిపిచ్చినట్లు వున్నా సెకండ్ హాఫ్ మాత్రం అదిరిపోయే రేంజ్ లో వుంది.వెంకీ నటన గురించి మాట్లాడాలంటే మాటల్లో చెప్పలేనంత అద్బుతంగా నటించాడు ,కుటుంభ సమేతంగా అందరూ చూడదగ్గ మంచి సినిమా ఇది..

మ‌ల‌యాళ దృశ్యం సినిమాని ఎలాంటి మార్పులు లేకుండా యాజ్ ఇట్ ఈజ్ గా ఫాలో అయిపోవ‌డం. వెంకీతో స‌హా చిత్ర బృందం అంతా క‌థ‌ని న‌మ్మారు. దాని ఫ‌లితం అడుగడుగునా క‌నిపిస్తుంటుంది. ఇది బేసిగ్గా ఓ థ్రిల్ల‌ర్‌. త‌ర‌వాత ఏం జ‌రుగుతుందా??  అనే  ఆస‌క్తి… క‌లిగిస్తుంటుంది. అయితే ఈ థ్రిల్ల‌ర్‌ని ఓ ఫ్యామిలీ డ్రామాకి షిప్ట్ చేయ‌డం వ‌ల్ల క‌థ‌లో కొత్త‌ద‌నం వచ్చింది. క‌థ‌లోకి ఎంట‌ర్ అవ్వ‌డానికి కాస్త స‌మ‌యం తీసుకొంది ద‌ర్శ‌కురాలు. తొలి అర‌గంట‌… రాంబాబు మ‌న‌స్త‌త్వం, ఆ ఊరి వ్య‌వ‌హారాలు, కానిస్టేబుల్‌తో గొడ‌వ‌, త‌న మ‌ధ్య‌త‌ర‌గ‌తి మ‌న‌స్త‌త్వం… వీటిని ట‌చ్ చేసుకొంటూ న‌డిచింది.

క‌థ‌లో ఏం లేదేంటి..??  అని ప్రేక్ష‌కుడు ఫీల్ అవ్వ‌కుండానే…. క‌థ‌లో వేగం పెంచి, ప్రేక్ష‌కుడి అసంతృప్తిని దూరం చేసింది శ్రీ‌ప్రియ‌. ఎప్పుడైతే సెల్‌ఫోన్ బ్లాక్‌మెయిల్ ఎపిసోడ్ ప్రారంభం అయ్యిందో అప్ప‌టి నుంచీ… క‌థ జెడ్ స్పీడ్‌తో న‌డుస్తుంటుంది. ఓ థ్రిల్లింగ్ పాయింట్ ద‌గ్గ‌ర క‌థ‌కు ఇంట్ర‌వెల్ కార్డు వేశాడు. ఇంట్ర‌వెల్ త‌ర‌వాత‌… క‌థ మ‌రింత స్పీడ్ అందుకొంటోంది. స్ర్కీన్ ప్లే ఎంత బాగా కుదిరిందంటే… సెకండాఫ్‌లో ఒక్క‌టంటే ఒక్క‌సీన్ కూడా తీసి ప‌క్క‌న పెట్ట‌డానికి లేకుండా పోయింది. నిడివి త‌గ్గించ‌డం కోసం ఒక్క సీన్ ప‌క్క‌న పెట్టినా క‌థ ఆర్డ‌ర్ మారిపోతుంది. అంత‌లా… స్ర్కీన్ ప్లే టైట్‌గా రాసుకొన్నారు.

పాజిటివ్ పాయింట్స్: 

  • ఆకట్టుకునే కథ,

  • భావోద్వేగానికి గురి చేసే డైలాగ్స్

  • బ్యాక్ గ్రౌండ్ స్కోర్

నెగిటివ్ పాయింట్స్:

  • స్క్రీన్ ప్లే,

  • ఎడిటింగ్,

  • సినిమాటోగ్రఫి

అయితే ఈ చిత్ర తొలి భాగంలోనూ, రెండవ భాగంలోనూ కథనంలో వేగం మందగించడం ప్రేక్షకుడ్ని కొంత అసహనానికి గురి చేసేలా ఉంది.  ఎడిటింగ్ కు దర్శకురాలు ఇంకాస్త పదను పెట్టి ఉంటే కథనంలో వేగం మరింత పెరిగేదనే ఫీలింగ్ కలిగింది. కెమెరా పనితనం గొప్పగా లేకున్నా.. ఓకే రేంజ్ లో ఉంది. అక్కడక్కడా తడబాటుకు గురైనా.. సస్పెన్స్, థ్రిలింగ్ అంశాలు పక్కదారి పట్టకుండా జాగ్రత్త వహించారు. అయితే క్లైమాక్స్ లో ఈ చిత్రాన్ని గాడిలో పెట్టడమే కాకుండా.. ప్రేక్షకుడికి పూర్తి స్థాయి సంతృప్తిని పంచడంలో దర్శకురాలు శ్రీప్రియ సఫలమయ్యారు.  ఈ చిత్రంలో కొన్ని లోపాలున్నా.. సానుకూల అంశాలు ఎక్కువగా డామినేట్ చేశాయి. ఓవరాల్ గా ఈ మధ్యకాలంలో వచ్చిన చిత్రాలతో పోల్చుకంఉటే  ‘దృశ్యం’ ఓ ఫీల్ గుడ్ చిత్రంగా నిలవడం ఖాయం.


Tuesday, 8 July 2014

వినాయక్ కు టెన్షన్..టెన్షన్

దర్శకుడు వివి వినాయక్ కు రెండు టెన్షన్లు పట్టి పీడిస్తున్నాయట. ఒకటి అంచనాలకు మించిన ఖర్చుతో నిర్మించిన అల్లుడు శీను. అది పెద్ద సవాల్. దీని ఫలితం ఎలా వుంటుందా అని కిందా మీదా పడుతున్నాడట. బెల్లంకొండ సురేష్ తనపైనే మొత్తం భారం పెట్టి, కావాల్సిన వనరులు, సమంత, తమన్నా లాంటి నటులను తెచ్చి మరీ సహకరించాడు. ఇంక ఫలితం రివర్స్ అయితే దాని ప్రభావం తనపైనే వుంటుందన్నది ఒక ఆందోళన.  మరోపక్క మెగాస్టార్ ప్రెస్టీజియస్ మూవీకి తననే డైరక్టర్ అని మాట ఇచ్చారు కానీ చిన్న ట్విస్ట్ వుందని వినికిడి. ఆగస్టు 22 లోగా ఏ రచయిత కథ తెచ్చినా, అది నచ్చినా వినాయక్ మాత్రమే డైరెక్ట్ చేస్తాడు. కానీ ఒక వేళ వేరే దర్శకుడు ఎవరైనా చిరుకు నచ్చే కథ తెచ్చిన పక్షంలో మాత్రం చాన్స్ ఆ డైరక్టర్ కు వెళ్లిపోతుంది. చాలా మంది డైరక్టర్ లు ఈ పనిలో బిజీగా వున్నారు.  అందుకే ఇప్పుడు ఆ చాన్స్ వదులుకోకుండా వుండడం కోసం వినాయక్, తన రచయిత ఆకుల శివ కలిసి ఎలాగైనా చిరుకు నచ్చే కథ వండాలని కిందా మీదా పడుతున్నారట. రెండు టెన్షన్లు ఒకేసారి. పాపం కష్టమే మరి. 

VV VINAYAK INTERVIEW

VV Vinayak is one of the successful directors in Tollywood who has delivered commercial entertainers with the top league  actors. V V Vinayak's upcoming film 'Alludu Sreenu' starring Bellamkonda Sai Sreenivas and Samantha is ready to hit the screens on July 25, 2014 and the director is confident  that Bellamkonda Sai Sreenivas will entertain the Telugu audience. Here are the excerpts of Greatandhra's exclusive  interview with VV Vinayak. Tell us about Alludu Sreenu? Alludu Sreenu is a full length commercial entertainer. For the first 15 minutes, audience will feel that they are watching  a new actor. After that, my hero will entertain everyone with his performance, fights and dance moves. Throughout my career,  I've always believed that the content should be interesting. We have a good script and it is well supported by  the technical departments. I can promise you that audience won't be disappointed and they will feel that they are watching a big star.  Was it difficult to work with a debutante? There is nothing like easy and difficult over here. Every film is challenging and I try to provide maximum entertainment  for the audience. I have worked with young heroes, but working with a debutante is new to me. By the time Bellamkonda  Suresh approached me to direct his son, Sreenivas was already trained in acting, fights and dances. Frankly speaking,  Sreenivas never troubled me while shooting and after watching the film, you can understand that he has all the qualities to become a big  star. The overall experience was great and i would give the credit to my technical team who have handled everything in a  great manner. You are one of the top league directors in Tollywood. Didn't you feel that you were risking your reputation by directing a debutant? Launching Bellamkonda Srinivas was obvious. As I have said earlier, I'm here because of Bellamkonda Suresh. Before getting  a chance to direct 'Aadi', none of the producers had belief in my abilities to direct a film. It was Suresh, who gave me a chance that day and I'm always thankful to him for that opportunity. Sreenivas was a kid when we were shooting for 'Aadi' and I remember asking Suresh if he was interested to bring his son into films. Suresh didn't take that seriously, but after years, when I got an offer to direct Sreenivas, I was more than happy to accept it.  People complain that you come up with the same kinds of stories. So far you have made either action or comedy movies. Are  you comfortable only with these genres? When I plan to make a film, my only aim will be, to entertain the audience. Be it with comedy or action, I always try to  make sure that the end product is interesting. I'm not that kind of a director who loves to experiment and yes I'm comfortable  with action and comedy genres. Just like a choreographer visualizes dance movements, I visualize fight sequences for my  movies. After directing high voltage films like Aadi, Chennakesava Reddy, Tagore and Yogi, etc. you have shifted from action to  comedy. Any specific reason? (Smiles) I was bored. Personally, I love comedy films and people are expecting more entertainment these days. As I told  earlier, content should be interesting and I'm doing the same. Bellamkonda Suresh has roped in top most technicians for Alludu Sreenu. Don't you think that this kind of a budget is too  much for a new hero? Can the producer recover the investment? We are confident that the investment will be recovered. Producer didn't waste any money and he has spent only on technicians and actors who played major role in this film. This is the debut movie of his son and Bellamkonda  Suresh made sure that everything is perfect. What sort of feedback have you obtained after the trailer and the songs were out? Mostly positive. Everyone appreciated Sreenivas's dance movements and Devi Sri Prasad has provided energetic album for our film. Suresh is very happy about the feedback and we are waiting for July 25. Tell us about Samantha and Tamanna I'm happy to work with Samantha and I should say that she is a brilliant performer. You just tell her about a scene, she will understand quickly, which is an advantage for a director. I have already worked with Tamanna in 'Badrinath' and our team is thankful to her for accepting to appear in a special song. You were very much attached to your father. Did anything change after he left you? Everything has changed. My father used to take care of everything in our family. My focus was only on the films at that time and he  used to plan other things related to the family. After his death, i had to fill in his place. Some time back, i was  hospitalized for a week because of severe back pain. Suddenly i started to think on the hospital bed that I’m the elder  person in my family now and i should be more careful. Speculations were strong that you will enter politics and quit films. Are you interested in politics? My father was into politics and i campaigned a lot for him. Our family got a good reputation at my place and after my  father's death, people started to ask me if I’m interested in politics. I don't have any bad opinion on politics. I have  been sincere in my work till date and i want people around me to be happy. Maybe this is not the right time to think about  politics as I’m busy with my films. Are you directing Megastar Chiranjeevi's 150th film? Nothing has been finalized and it is too early to comment on it. Ram Charan said that he would produce Chiranjeevi's 150th film and the hunt is on for a good story. Charan wants to gift his dad and he is excited about Chiranjeevi's 150th film. But let me tell you, as far as i know,  nobody can understand cinema better than Megastar Chiranjeevi garu. I have known him for years and he is a brilliant judge of  the script. I have been getting calls and people are asking if I'm directing this film. I'm happy to know that majority of  Chiranjeevi's fans are expecting me to direct his 150th film. Different options are being considered and I'm one of them.  It's up to Megastar to decide the director for that prestigious film and you all will know when that name is confirmed. Any plans on making 'Adurs 2' with Jr.NTR Tarak is more like a younger brother to me. When we met some time back at a party, we casually spoke about making 'Adurs 2'. NTR is currently busy with a lot of commitments and once he is done with them, we will work together. It won't be 'Adurs 2', but a new film. You haven't worked with Mahesh Babu and Pawan Kalyan so far. Any plans to direct them? Who doesn't want to work with actors like Mahesh and Pawan. Everything needs to fall into place and I will let you know  when I have a perfect script for them. Chennakesava Reddy is not one of the successful films in your career, but your efforts were appreciated. Is it true that you were offered  to direct Balakrishna's 100th film?  Balakrishna is a director's actor. I was very young at the time of Chennakesava Reddy and I was surprised by the kind of respect given to me by a senior actor like Balakrishna. As you said, it might not be one of the successful films in my career, but Chennakesava Reddy is really a special film for me. We were supposed to work together sometime back, but we didn't like that script. I'm waiting for a powerful and perfect script for Balakrishna garu. Have you seen the final version of Alludu Sreenu?  Our team has watched the final version and everyone is happy about the final output. Bellamkonda Suresh has worked harder than any one of us and I'm sure that the film is going to become a big hit. Devi Sri Prasad's songs and Chota K Naidu's cinematography are going to be major highlights in Alludu Sreenu along with the terrific performance of our Sai Sreenivas. Except for Yogi, none of my producers or distributors have lost money for my film. I take calculated risks and make sure that the producers and distributors are happy after a film is released. I make films for the audience and I promise that this film is going to entertain everyone. 

Sunday, 6 July 2014

చిరు సినిమాలో చరణ్

తన తండ్రి చిరంజీవి కథానాయకుడుగా రూపొందనున్న 150వ చిత్రంలో తాను కనీసం ఒక్క సన్నివేశంలోనైనా కనిపించే ప్రయత్నం చేస్తానని యువ కథానాయకుడు రామ్‌చరణ్ అంటున్నారు. చిరంజీవి నటించనున్న 150వ చిత్రం ఇంకా పూర్తిస్థాయి వివరాలు బయటికి రాలేదు. ఎలాంటి కథను ఎన్నుకోవాలి? దర్శకుడు ఎవరు? అన్న కథనాలపై ఇంకా మల్లగుల్లాలు సాగుతున్నాయి. సరైన కథ దొరికితే తాను తండ్రితో కలిసి నటించడానికి ఎటువంటి అభ్యంతరం లేదని, ఒక్క సీన్‌లో అయినాసరే కనిపిస్తానని, ఎందుకంటే ఆ చిత్రం తన తండ్రి సినీ ప్రయాణంలో ఓ మైలురాయి వంటిదని ఆయన అభివర్ణించారు. అంతేకాకుండా ఈ చిత్రాన్ని తమ సొంత సంస్థలో రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నామని, మంచి కథ వినిపించినవారికి కోటి రూపాయలైనా ఇవ్వడానికి అభ్యంతరం లేదని ఆయన చెబుతున్నారు.

Friday, 4 July 2014

బాలయ్య బాబు లెజెండ్ 100 రోజుల పండుగ

బాలయ్యబాబు హీరోగా భోయపాటి శ్రీను గారి దర్శకత్వంలో వచ్చిన లెజెండ్ నేటితో నూరు రోజులు దిగ్విజయంగా ముప్పై ఒకటి సెంటర్స్ లో ఘనంగా పూర్తిచేసుకుంటుంది....

Wednesday, 25 June 2014

గోవిందుడు అందరివాడేలే రషేస్ చూసి తెగ ఆనంద పడుతున్న బండ్లగణేష్ బాబు

ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న టాప్ నిర్మాతల్లో బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ కూడా ఒకరు. అయన నిర్మించే ప్రతి సినిమా చాలా రిచ్ గా ఉండాలని , తెలుగు ప్రేక్షకులకు విజువల్స్ తో సరికొత్త అనుభూతిని అందించే ఉద్దేశ్యంతో భారీ బడ్జెట్ తో సినిమాలను నిర్మిస్తారు. ప్రస్తుతం బండ్ల గణేష్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాని నిర్మిస్తున్నాడు.ఈ సినిమా కూడా తన నిర్మాణ కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని బండ్ల గణేష్ గట్టిగా చెబుతున్నాడు. ఇప్పుడే గోవిందుడు అందరివాడేలే రషెన్ చూశాను. అద్భుతంగా ఉన్నాయి. మా లిటిల్ స్టార్ మరియు కృష్ణవంశీకి థాంక్స్. ఇవి చూశాకా నా పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పై మరో బ్లాక్ బస్టర్ హిట్ రానున్నదని గర్వంగా అనౌన్స్ చేస్తున్నాను అని బండ్ల గణేష్ ట్విట్ చేశాడు.రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ , శ్రీకాంత్ , జయసుధ , కమలిని ముఖర్జీ కీలకపత్రాల్లో నటిస్తున్నారు. యువన్ శంకర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానున్నది. 

అల్లుడు శీను ఆడీయో వేడుకలు

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తన కుమారుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని హీరోగా పరిచయం చేస్తూ చేసిన సినిమా ‘అల్లుడు శీను’.సక్సెస్ఫుల్ టాలీవుడ్ కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆడియో ఈనెల 29న శిల్పకళావేదికలో ఘనంగా జరగనుంది.

Sunday, 15 June 2014

అక్టోబర్ 1 ఉదయం 5 గంటల 9 నిమిషాలకి రిలీజ్ కానున్న గోవిందుడు అందరివాడేలే




కృష్ణవంశీ రామ్ చరణ్ సినిమాను అప్పుడే క్లైమాక్స్ కు తీసుకొచ్చాడట.ఒకపక్క మళ్ళీ రీషూటింగ్ కి వెళ్లిందని ప్రచారం జరుగుతుండగానే నిర్మాత బండ్ల గణేష్ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించేశాడు. గోవిందుడు అందరివాడేలే టైటిల్ ను కన్ఫర్మ్ చేసిన ఈ సినిమా ప్రస్తుతం చెర్రీకి సంబంధించిన షూటింగ్ జరుగుతుండగా ఇప్పటికే మిగతా టాకీ పార్ట్ పూర్తి చేశారట. ఇక త్వరలో పాటల షూటింగ్ కూడా పూర్తి చేసి అక్టోబ‌రు 1న విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నారట.
రామ్ చరణ్-కాజల్, శ్రీకాంత్-కమలిని ముఖర్జీ జంటలుగా నటించిన ఈ సినిమాలో ప్ర‌కాష్‌రాజ్‌, జ‌య‌సుధ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్న ఈ సినిమాను ఎట్టి పరిస్థితిలో కూడా అక్టోబ‌రు 1న ఉద‌యం 5గంట‌ల‌కు ఫ‌స్ట్ షో ప‌డ‌బోతోందని బండ్ల గణేష్ గ్యారంటీగా చెప్పాడు. కాగా రీషూటింగ్ జరిగిందని నిజమేనని ఒప్పుకున్నా బండ్ల అది పూర్తిగా తన నిర్ణయమేనని చెబుతున్నాడు. రాజ్‌ కిర‌ణ్‌ స్థానంలో ప్ర‌కాష్‌ రాజ్‌ ని తీసుకోవ‌డం వలన కేవలం ఎనిమిది రోజులు మాత్ర‌మే రీషూట్ చేయాల్సివ‌చ్చిందని బండ్ల నిర్భయంగా ఒప్పుకున్నాడు! 

రామ్ చరణ్ పై మనసు పడిన బాలివుడ్ అతిలోక సుందరి!


బాలీవుడ్ ముద్దు గుమ్మలు దక్షిణ చిత్ర పరిశ్రమలో ఎప్పుడెప్పుడు నటించుదామా అని ఎదురు చూస్తూ ఉంటారు. దానికి కారణం లేకపోలేదు. దక్షిణాదిన ప్రేక్షకులు నటి నటులను తమ కుటుంబ సభ్యులు గా భావించి అమితమైన ప్రేమ ను కురిపిస్తుంటారు. అందుకే వారు ఎప్పుడెప్పుడు ఇటు వైపు వద్దామా అని ఆశ తో ఎదురు చూస్తూ ఉంటారు. సాధారణం గా అలా ఎదురు చూసే వారిలో అత్యధిక మంది కొన్ని కొన్ని గొంతెమ్మ కోరికల తో తయారు గా ఉంటారు. మాజీ మిస్ ఇండియా ఇషా గుప్తా కుడా ఇలాంటి ఆశలతో నే దక్షిణాది పై ఒక చూపు వేసి ఉంచింది. కానీ ప్రత్యేకించి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పక్కన మాత్రమే నటిస్తాను అని మనసులో ని కోరికను బయట పెట్టింది. “దక్షిణాది పరిశ్రమ లో పని చేయడానికి ఉత్సాహంగా ఉన్నాను, తమిళం లో సూర్య పక్కన నటించాలని ఉంది. అలాగే నేను రామ్ చరణ్ కి వీరాభిమాని ని. ఒక్క సారి అయిన తన పక్కన నటించాలి అని ఎదురు చూస్తున్నాను” అని కోరికల చిట్టా విప్పింది. ఇషా కి తమన్నా మంచి స్నేహితురాలు. తమన్నా చరణ్ సరసన రచ్చ చేసింది. ఇషా కోసం తమన్నా చరణ్ పక్కన అవకాశం కలిపిస్తుందేమో అని వేచి చూడాలి...

చెర్రిని మహేష్ ని డీ కొట్టనున్న వరుణ్ తేజ్

సంక్రాంతికిపోటీ పడిన ఆ హీరోలిద్దరూ ఇప్పుడు దసరా రేసులో పోటీ పడుతున్నారు. రామ్‌ చరణ్‌ లేటెస్ట్‌ సినిమా గోవిందుడు అందరివాడే అక్టోబర్‌ 1న విడుదల కానుంది. ఇక ప్రిన్స్‌ మహేష్‌ ఆగడు సినిమా కూడా సెప్టెంబర్‌ 26న రిలీజ్‌ కానున్నట్లు ఇప్పటికే టాలీవుడ్‌-లో టాక్‌ నడుస్తోంది. ఈ పెద్ద హీరోల మధ్యలో మరో మెగా హీరో వరుణ్‌ తేజ్‌ సినిమా గొల్లభామ కూడా రిలీజ్‌ కాబోతోంది. ఇలా ప్రిన్స్‌-కి పోటీ ఇచ్చేందుకు మెగా హీరోలు రెడీ అయ్యారని టాలీవుడ్‌-లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సంక్రాంతి రేసులో ఎవడుతో ముందు నిలిచిన రామ్‌ చరణ్‌ , ఫ్యామిలీ మూవీతో దసరా రేసులోనూ మహేష్‌-ని వెనక్కి నెట్టాలని చూస్తున్నాడట. మరోవైపు నాగబాబు కుమారుడు వరుణ్‌ తేజ్‌ కూడా మహేష్‌-కు పోటీగా నిలవాలని చూస్తున్నాడట. ఈ మెగా హీరోల ఉచ్చును ప్రిన్స్‌ ఛేదించి విజయం అందుకుంటాడా లేడా అన్నది దసరా హిట్‌ తేలుస్తుంది

Monday, 9 June 2014

పట్టాలెక్కనున్న చిరు 150 వ సినిమా


పెయింటర్ అయిన పవన్ కూతురు !

పవన్ పిల్లలు తమ తల్లి రేణుదేశాయ్ దగ్గర సమ్మర్ హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో రేణు బాలీవుడ్ లో తీస్తున్న ‘ఇష్క్ వాలా లవ్’ సినిమా హీరో అదినాత్ దగ్గర పెయింటింగ్ నేర్చుకుంటూ తన ప్రతిభను మెరుగు పరుచు కుంటోOదట పవన్ ముద్దుల కూతురు ఆధ్యా. ఈ చిన్నారి క్రియేటివిటీకి ‘ఇష్క్ వాలా లవ్’ సినిమా యూనిట్ అంతా ఆశ్చర్య పోతున్నారట. ఇప్పటిదాకా మెగా కుటుంబంలో వరుస పెట్టి వస్తున్న హీరోలను చూసాం. ఇక రానున్న కాలంలో కొణిదల కుటుంబం నుండి రకరకాల కళల నైపుణ్యంతో రాబోయే కొత్త తరం కళాకారులను మెగా కుటుంబం నుండి చూడబోతున్నాం అనుకోవాలి.

రాబోతున్న కాలంలో తండ్రి పవన్ రాజకీయాల దిశను మార్చే నాయకుడిగా ఎదిగితే సున్నిత భావాలను వ్యక్త పరిచే పెయింటర్ గా ఆధ్యా రూపొందుతుందని అనుకోవాలి. త్వరలో రాజకీయాలు పక్కకు పెట్టి తిరిగి కెమెరా ముందుకు రాబోతున్న పవన్ కళ్యాణ్ సినిమాల జోష్ తో పాటు పవన్ కూతురుకు సంబంధించిన ఈ న్యూస్ కూడ పవన్ అభిమానులను జోష్ లో ముంచెత్తేస్తుంది అని అనుకోవాలి.


Saturday, 7 June 2014

పవన్ వెంకీల గోపాలా...గోపాలా

పవన్ కళ్యాణ్, వెంకటేష్ కాంబినేషన్లో హిందీ సూపర్ హిట్ మూవీ ‘ఓ మై గాడ్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలసిందే. ఈ చిత్రానికి ‘దేవ దేవం భజే’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రానికి ‘గోపాలా గోపాలా’ అనే టైటిల్ ఖరారు చేసే యోఛనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో అఫీషియల్ సమాచారం వెలువడనుంది.

 ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక దాదాపుగా పూర్తయింది. వెంకీ జోడీగా శ్రీయను ఎంపిక చేసారు. అదే విధంగా వెంకీ అసిస్టెంట్ పాత్రకు కృష్ణుడిని తీసుకున్నారు. ఇప్పటికే రామానాయుడు సినీ విలేజ్‌లో సినిమాకు సంబంధించిన మార్కెట్ సెట్ సైతం వేసారు. మరికొన్ని రోజుల్ల సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ‘ఓ మై గాడ్’ ఒరిజినల్ వెర్షన్లో మిథున్ చక్రవర్తి లీలాధర్ స్వామిజీ పాత్రలో నటించారు. తెలుగులో వెర్షన్లోనూ ఆయన అదే పాత్ర పోషిస్తారని తెలుస్తోంది.

రుబాబుగా జూనియర్ బాబు

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందించాడు. గతంలో ‘కుమ్మెస్తా’ టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ‘రుబాబు’ అనే టైటిల్ తెరపైకి వచ్చింది. మరి ఈ టైటిల్ అయినా ఫైలన్ అవుతుందో? లేదో? త్వరలో తేలనుంది. ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మించనున్నారు. గతంలో జూ ఎన్టీఆర్ ‘బాద్ షా’ చిత్రాన్ని నిర్మించి హిట్ కొట్టిన గణేష్ ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్‌తో చేసే ఛాన్స్ రావడంపై ఆనందంగా ఉన్నాడు.

వాస్తవానికి….మహేష్ బాబు-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో సినిమాను చేయడానికి రెడీ అయ్యాడు బండ్ల గణేష్. అయితే ఇతర ప్రాజెక్టుల ఇచ్చిన కమిట్మెంట్స్ వల్ల పూరి జగన్నాథ్‌తో చేయాల్సిన సినిమాను హోల్డ్‌లో పెట్టాడు మహేష్ బాబు. ఆయనతో సినిమా చేయడానికి చాలా సమయం ఉండటంతో ఈ లోగా జూ ఎన్టీఆర్‌తో ఓ సినిమా ప్లాన్ చేసాడు పూరి. ఈ సినిమాను నిర్మించే అవకాశం కూడా బండ్ల గణేష్‌కే ఇచ్చాడు.


మనం దర్శకుడితో మహేష్ బాబు


అద్భుతమైన కథ, కథనాలతో ‘మనం’ చిత్రాన్ని రూపొందించి ప్రశంసలు అందుకుంటున్న దర్శకుడు విక్రంకుమార్ కి చాలా ఆఫర్లు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం మహేష్ బాబు తనకో కథ చెప్పమని విక్రంని అడిగాడట. ఈ విషయాన్ని ఈ రోజు నాగార్జున వెల్లడించారు. “మనం సినిమా చూసి మహేష్ ఫోన్ చేసి చాలా సేపు మాట్లాడాడు. అసలు ఇంతటి సంక్లిష్టమైన కథను ఎలా జడ్జ్ చేయగలిగారని అడిగాడు. తను కూడా విక్రం చెప్పే కథ ఒకటి వింటున్నాననీ, అది నన్ను కూడా వినమని చెప్పాడు” అని చెప్పారు నాగార్జున. సో… త్వరలో మహేష్ -విక్రం కాంబోలో సినిమా ఎక్స్ పెక్ట్ చేయచ్చు! 

Friday, 6 June 2014

తన పారితోషకాన్ని వెనక్కి ఇచ్చేసిన రామ్ చరణ్


సుకుమార్ దర్శకత్వంలో బన్నీ !

ఇటీవలే ‘రేసుగుర్రం’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యాడు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. అయితే ఈ సినిమా తర్వాత తమ సొంత సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ ని బన్నీ ఓ సినిమా చేయమన్నాడు. విశేషం ఏమిటంటే , ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించనున్నాడట. గతంలో గీతా ఆర్ట్స్ కి ’100% లవ్’ వంటి హిట్ సినిమాని చేసిన సుకుమార్  ఈ నేపధ్యంలో అల్లు అరవింద్ ఈ దర్శకుడికి పిలిచి మరీ అవకాశం ఇచ్చాడట. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని , త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా పూర్తయ్యాక ఇది మొదలవుతుందని సమాచారం. ఇటీవలే బన్నీ ఓ కుమారుడికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. దాంతో ప్రస్తుతం అల్లు అర్జున్ ఫుల్ హ్యాపీ గా ఉన్నాడు

HOLIDAY MOVIE REVIEW

Akshay Kumar returns to the silver screen after a hiatus. Known for having a film release every few months, this move has, expectedly, garnered positive reception by the film fraternity as well as the multitude of fans. In his newest outing HOLIDAY - A SOLDIER IS NEVER OFF DUTY, the actor teams up with A.R. Murugadoss, who made his Hindi debut with GHAJINI [2008], starring Aamir Khan. Incidentally, Murugadoss too returns to the Hindi film arena after a gap of almost six years.

HOLIDAY - A SOLDIER IS NEVER OFF DUTY is a remake of the Tamil action-thriller THUPPAKKI [2012; starring Vijay and Kajal Aggarwal], which won immense critical acclaim and reaped a rich harvest at the box-office. Obviously, the expectations are humungous since Murugadoss' GHAJINI was the *first Hindi film* to waltz past the Rs 100 cr mark in the domestic market. Besides, THUPPAKKI has been a Blockbuster and one expects the Hindi adaptation to repeat history. 

When one attempts to remake South Indian hits in Hindi, one makes modifications to suit the Northern sensibilities, which only enhances the project in question. Murugadoss does exactly that in HOLIDAY - A SOLDIER IS NEVER OFF DUTY. THUPPAKKI was a hugely admired and engrossing entertainer and evidently ranks amongst Murugadoss' finest works. Does the able craftsman deliver a far superior product in HOLIDAY - A SOLDIER IS NEVER OFF DUTY? Does Akshay slip into Vijay's shoes with as much ease? Is the new antagonist Farhad as merciless and cold-blooded as the original baddie Vidyut Jammwal? Most importantly, does Murugadoss take a leap forward as he recreates his bonafide Hit? 

Let's shed light on the premise! Captain Virat Bakshi [Akshay Kumar], an army man, returns home to Mumbai for his holidays. His family takes him to see Sahiba [Sonakshi Sinha], but he rejects her. Later, on another occasion, he finds out that she is actually a boxer and is surprised by her personality. The story takes a turn when an anti-social activity in the heart of Mumbai city gets him involved into something huge. 

Being a patriot and a special agent in the Indian Army, Virat is dragged into a huge network of terrorism. The rest of the story is about his fight against the terrorist network and the eradication of the sleeper cells from the city. 

Let's not confuse HOLIDAY - A SOLDIER IS NEVER OFF DUTY with atypical Akshay Kumar film that tilts heavily towards humor or has an uninterrupted flow of gags. This one tackles a serious issue -- terrorism -- and how a lone soldier sets out to annihilate the sleeper cells that are out to create mayhem in Mumbai. Sure, a number of films focusing on terrorism have made it to the big screen, especially post 9/11, but Murugadoss marries the serious issue and good old romance [Akshay-Sonakshi] most effortlessly. Of course, much like the original source, HOLIDAY - A SOLDIER IS NEVER OFF DUTY veers towards the clash between a soldier and the terror forces, but the storyteller, who's eyeing the pan-India audience, makes sure he gives the masala movie lovers something more than that. 

Additionally, in a majority of entertainers, the screenplay takes a backseat, while the star power takes precedence. HOLIDAY - A SOLDIER IS NEVER OFF DUTY comes across as an exception because the smartly-packaged fare never loses focus from its core issue [the fight between an army man and terrorists], with the post-interval portions diversifying into race-against-time thriller mode. Also, Murugadoss employs the right tricks to woo the entertainment-seeking spectator -- abundant turns in the screenplay, the face off between good and evil, the hand-to-hand combat, the subtle humor, the nail-biting finale et al -- but at the end of the day, the message that the film communicates resonates loud and clear. 

Expertly filmed and edited [Amitabh Shukla], the sole hiccup is that the romantic portions could've been short-n-snappy. The club song in the second hour appears forced. Besides, though the makers employ Pritam to belt out chartbusting melodies, the soundtrack is plain ordinary. But these are minor hiccups in an otherwise slick film that gets so many things right. 

N. Nataraja Subramanian's camera gives the film scale, while the action sequences [Greg Powell, Anl Arasu] are raw, gritty and appealing. 

Murugadoss abstains from casting over-familiar faces for pivotal characters, choosing actors who aren't known for featuring in Akshay starrers [except Sonakshi]. Govinda is restrained in a cameo. Sonakshi Sinha is effervescent and contributes in making the proceedings lively. Sumeet Raghavan is wonderful, absolutely in sync with his character. Farhad [aka Freddy Daruwala] is impactful as the antagonist. He has good screen presence and handles his part with conviction. Zakir Hussain effectively portrays the same part that he essayed in the original. 

The scene-stealer is, without doubt, Akshay Kumar, who reinvents himself with this one. The actor has acted in every possible genre and though the cynics may argue that Akshay keeps repeating himself in film after film, I'd like to remind them of his nuanced act in SPECIAL 26 and now HOLIDAY - A SOLDIER IS NEVER OFF DUTY. It's a power-packed portrayal, which the actor illustrates with complete understanding, without going overboard. This is Akshay's show unquestionably! 

On the whole, HOLIDAY - A SOLDIER IS NEVER OFF DUTY is a slick action-thriller that keeps you engrossed, enthralled and captivated all through, thanks to its fascinating premise and a watertight, razor-sharp screenplay. Go for it!

final review 3.5/5

Thursday, 5 June 2014

చరణ్ మహేష్ లు టి.వి లలో కూడా పోటి పడనున్నారు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కి సూపర్ స్టార్ మహేష్ బాబుకి బాక్సాఫీస్ దగ్గరె కాదు టి.వి.రంగంలో కూడా పోటి జరగనుంది  మొన్న సంక్రాంత్రి పండగకి బాక్సాఫీస్ దగ్గర ఎవడు - వన్ సినిమాల మధ్య పోటిపడ్డ సంగతి మనకి తెలిసిందే అంతటితొ ఆగకుండా ఈ ఆదివారం చానళ్ళలో టెలికాస్ట్ అయ్యె సినిమాలు కూడా ఈ రెండు సినిమాలే ప్రసారం అవ్వడం గమనార్హం 08-06-2014 ఆదివారం సాయంత్రం 6గంటలకు మాటివి లో చరణ్ ఎవడు అదే సమయానికి జెమినిటివి లో వన్ సినిమాలు పోటి పడనున్నాయ్  

రేయ్ సినిమాలో పవణ్ కళ్యాణ్

మెగా హీరో సినిమా ప్రమోషన్ కోసం ఏకంగా పవన్ కళ్యాణ్ పైనే ఒక ప్రమోషన్ సాంగ్ ను తయారుచేసి అది ఆ మెగాహీరో సినిమా పబ్లిసిటీకి వాడటం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇక వివరాలలోకి వెళితే పవన్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ‘రేయ్’ సినిమా కోసం ఆ సినిమా నిర్మాత వై.వి.యస్. చౌదరి ఈ ప్లాన్ రచించినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో విడుదల కాబోతున్న ఈసినిమా మార్కెట్ పై క్రేజ్ పెంచడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబోస్ చేత పవన్ గొప్పతనం పై ఆ పాట రాయించారని తెలుస్తోంది. ఈసినిమా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ లో దీన్ని విడుదల చేయాలని నిర్ణయించారని టాక్.

ఈ మేరకు షూటింగ్ కూడా పెట్టుకుంటున్నట్లు సమాచారం. ఆర్ధిక సమస్యల మధ్య చిక్కుకుని ఉన్న ‘రేయ్’ సినిమా భవిష్యత్ ను ఈ ఎత్తుగడ ఏమైనా కాపాడుతుందేమో చూడాలి. ఇప్పటికే అల్లుఅరవింద్ నుండి ‘రేయ్’ సినిమా విడుదల విషయంలో నిర్మాత చౌదరికి వార్నింగ్ లు వస్తున్నాయి అని వార్తలు వస్తున్న నేపధ్యంలో చౌదరి ఏదోవిధంగా ఈసినిమాను విడుదల చేయడానికి ఈ ఎత్తుగడ వేసాడు అనుకోవాలి.

Thursday, 29 May 2014

50 రోజులకు చేరుకున్న రేసుగుర్రం పరుగు


రేసుగుర్రం రేసు 169 కేంద్రాలలో అర్థశతదీనోత్సవంకు చేరుకుంది......ఈ రేసు ఇదే వేగంతో శతదినోత్సవం  వైపు దూసుకెళ్ళాలని కోరుకుందాము.. ఇంతటి ఘనవిజయాన్ని కారణమైన దర్శకులు సురేందర్ రెడ్డి గారికి నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్ గారికి మరియు వెంకటేశ్వర్ రావు గారికి దన్యవాదాలు......
NIZAM                        53
CEDED                       34
NELLORE                    07
KRISHNA                    09
GUNTUR                     12
VIZAG                        24
EAST GODAVARI          14
WEST GODAVARI         06
OTHERS                     10

WORLD WIDE TOTAL DIRECT CENTERS -169

Sunday, 25 May 2014

రాజమౌళీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ రెండో సినిమా....

మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న మరో హీరో నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ రెండో సినిమాకి దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించనున్నాడట! ఆ మేరకు నాగబాబు జక్కన్న తో మాట్లాడట కూడా అయిపోయింది. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ” గొల్లభామ ” అనే చిత్రంలో నటిస్తున్నాడు వరుణ్. నాగబాబు తనయుడి రెండో సినిమా మాత్రం దర్శక ధీరుడు రాజమౌళి ని చేయమని అడిగాడట దానికి రాజమౌళి నుండి వెంటనే చేద్దాం అని  అన్నారట ! చరణ్ రెండో సినిమా చేసిన రాజమౌళి కెరీర్ లో శాశ్వతంగా నిలిచి పోయే ” మగధీర ” ని ఇచ్చాడు. సో వరుణ్ కి కూడా అలా నిలిచి పోయే  బ్లాక్ బస్టర్ ఇవ్వాలని కోరుకుందాం.....రాజమౌళి గారి బాహుబళి తర్వాత ఈ సినిమా పట్టాలెక్కనుంది

Friday, 23 May 2014

కేరళలో మల్లు అర్జుణ్ హవా

Will Be In Mall Of Joy @ Thrissur Today.... Kerala Fans Arranged A Huge Ceremony There For Welcoming The Handsome King Of South......


మనసున్న మనం సినిమా రివ్యూ

రివ్యూ: మనం
రేటింగ్‌: 3.5/5

బ్యానర్‌: అన్నపూర్ణ స్టూడియోస్‌

తారాగణం: అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, సమంత, శ్రియ, లావణ్య, అఖిల్‌ (అతిథి పాత్రలో) తదితరులు
మాటలు: హర్షవర్ధన్‌
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
కూర్పు: ప్రవీణ్‌ పూడి
ఛాయాగ్రహణం: పి.ఎస్‌. వినోద్‌
నిర్మాణం: అక్కినేని కుటుంబం
కథ, కథనం, దర్శకత్వం: విక్రమ్‌ కె. కుమార్‌
విడుదల తేదీ: మే 23, 2014
అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలు నటించిన చిత్రం... నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి చిత్రం... ఒక సినిమాపై ఆసక్తి కలగడానికి, దానికోసం ఎదురు చూడడానికి ఇంతకంటే ఏం కావాలి? అయితే మనం కేవలం ఈ రెండు అంశాలతోనే ఆకట్టుకోలేదు. పోస్టర్స్‌ దగ్గర్నుంచి ట్రెయిలర్స్‌ వరకు... సాంగ్స్‌ దగ్గర్నుంచి విజువల్స్‌ వరకు అన్నీ సినిమాపై ఒక పాజిటివ్‌ ఫీల్‌ కలిగేట్టు చేసాయి. ఒక సినిమా ట్రెయిలర్‌ చూడగానే దీని కథ ఇది.. ఇలా ఉంటుంది.. అంటూ ఒక అంచనాకి రావచ్చు. కానీ మనం ట్రెయిలర్స్‌ చూస్తే... ‘ఇది ఎలా ఉండబోతుంది’ అనే ఆలోచన మొదలైంది. మూడు తరాల హీరోలు దొరికితే మూస కుటుంబ కథా చిత్రమొకటి తీసేసి చేతులు దులిపేసుకోవచ్చని అనుకుంటారు చాలా మంది. కానీ దర్శకుడు విక్రమ్‌ కె. కుమార్‌ ఆ క్యాటగిరీకి చెందినవాడు కాదు. 13 బి, ఇష్క్‌లాంటి సినిమాల్తో ఇంప్రెస్‌ చేసిన విక్రమ్‌ కుమార్‌... అక్కినేని హీరోలందరినీ ఒకే కథలోకి తెచ్చే ఛాలెంజ్‌ని యాక్సెప్ట్‌ చేసి దానిని సక్సెస్‌ఫుల్‌గా అఛీవ్‌ చేసాడు. ‘మనం’ ఒక ఫిలిం కాదు... ఇదొక సెలబ్రేషన్‌. సినిమానైతే విశ్లేషించుకోవచ్చు కానీ... ఇలాంటి వేడుకని ఎక్స్‌పీరియన్స్‌ చేయాల్సిందే. ఆ అనుభవాన్ని అక్షరాల్లో పెట్టడానికి మా వంతు కృషి చేస్తాం... ఆ అనుభూతిని జస్ట్‌ ఈ అక్షరాల్లో తెలుసుకోడానికి ఆట్టే కష్టపడకుండా... అందుబాటులో ఉన్న మనం థియేటర్లో అడుగు పెట్టేయండి. 
కథేంటి?
  కథ చెబితె కథ నచ్చిన వారు సినిమాకి వెలుతారు నచ్చని వారు టి.వి లొ ఎప్పుడు వస్తె చూద్దామా అని ఎదురు చూస్తుంటారు లేక పైరసి సిడి కొనుక్కొని చూద్దాంలె అని అనుకుంటారు...కాని ప్రతియొక్కరు దయచేసి థియేటర్లో మాత్రమె చూడండి...పైరసినిని ఎంకరేజ్ చేయకండి.....ప్లీజ్.. ప్లీజ్...ప్లీజ్
కళాకారుల పనితీరు!
నటించే ఓపిక, ఉత్సాహం ఉన్నప్పటికీ... 1990ల తర్వాత అక్కినేని నాగేశ్వరరావు చాలా అరుదుగా సినిమాలు చేసుకుంటూ వచ్చారు. తన స్థాయికి, అనుభవానికి తగ్గ పాత్ర అనిపిస్తేనే ఆయన అంగీకరించారు. అంత అరుదుగా సినిమాలు అంగీకరించిన అక్కినేని.. తన కొడుకు, మనవడితో కలిసి నటించాలని అనుకున్నప్పుడు అల్లాటప్పా సినిమా ఎలా చేస్తారు? ‘మనం’ సినిమా విషయంలో ఏఎన్నాఆర్‌ అంగీకారం పొందడంతోనే దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ సక్సెస్‌ అయ్యాడు. అక్కినేనికి సిసలైన నివాళిగా ఈ చిత్రం నిలిచిపోతుంది. నటుడిగా ఆయన ఏంటో ఇప్పుడు చెప్పక్కర్లేదు. ఆయన సామర్ధ్యాన్ని పరీక్షించే పాత్రలు ఇప్పుడెవరూ రాయలేరు. ఆయన నటించడంతో మనం సినిమా పునీతమైంది.. తెలుగు సినీ చరిత్ర పుటల్లో చేరుతుంది. 
నాగార్జున చాలా ఎంజాయ్‌ చేస్తూ చేసారని ఆయనని చూస్తేనే అర్థమవుతుంది. ఆర్టిస్ట్‌ తనకిచ్చిన జాబ్‌ని ఎంజాయ్‌ చేసాడంటే... అవుట్‌పుట్‌ ఖచ్చితంగా అద్దిరిపోతుంది. ఈమధ్య కొన్ని నాసి రకం పాత్రల్లో నాగార్జునని చూసాక... ఇందులో చూస్తుంటే హాయిగా అనిపిస్తుంది. నాగార్జున కంటే కూడా ఈ సినిమాతో నాగ చైతన్య ఎక్కువ మార్కులు కొట్టేస్తాడు. నటుడిగా ఎంత పరిపక్వత సాధించాడనేది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. తండ్రి, తాతతో నటించడం వల్ల తన కంఫర్ట్‌ లెవల్స్‌ పెరిగాయో... ఈ సినిమాని విపరీతంగా ప్రేమించడం వల్ల తన శాయశక్తులా దానికి న్యాయం చేయాలని చూసాడో తెలీదు కానీ... ఇంతవరకు నాగచైతన్యపై ఎలాంటి ఒపీనియన్‌ కానీ, ఏ విధమైన ఇంప్రెషన్‌ కానీ లేని వారికి ‘మనం’తో అక్కినేని వంశ వైభవాన్ని నిలబెట్టే సత్తా ఇతనికి ఉందనే అభిప్రాయం ఏర్పడుతుంది. సమంత మరోసారి ఆకట్టుకుంది. చైతన్యతో ఆమె ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ ఇంకోసారి ఇంప్రెస్‌ చేస్తుంది. శ్రియ తన పాత్రకి న్యాయం చేసింది. ఒక్కసారి అలా తళుక్కున మెరిసిన అఖిల్‌ ఆ కొద్ది క్షణాల్లోనే ఫ్యూచర్‌లో స్టార్‌ కాగల మెటీరియల్‌ అనిపిస్తాడు.
సాంకేతిక వర్గం పనితీరు:
అనూప్‌ సంగీతం ఈ చిత్రానికి ప్రాణ వాయువుగా మారింది. పాటలన్నీ వీనుల విందుగానే కాక కనువిందు చేసాయి కూడా. ఇక నేపథ్య సంగీతమైతే... ‘మనం’ సినిమాకి తానే సంగీతమందించానని పది కాలాల పాటు అనూప్‌ గర్వంగా చెప్పుకుని తిరగొచ్చు. అంత గొప్పగా దీనికి జీవం పోసాడు. పి.ఎస్‌. వినోద్‌ ఛాయాగ్రహణం దర్శకుడి ఊహలకి ఊపిరినిచ్చింది. ఆ కాలాన్ని, ఈ కాలాన్ని తన కెమెరా కంటితో స్పష్టంగా వేరు చేయడమే కాకుండా... ప్రతి ఫ్రేమ్‌కీ కళ తెచ్చాడు. మనం సినిమా ఒక అందమైన పాట అనుకుంటే... సంగీతం, ఛాయాగ్రహణం దీనికి శృతి, లయలు. కథలేక, కదల్లేక పోయే సినిమాల్ని ఎడిట్‌ చేసేయడం ఈజీ. ఇంత విషయమున్న సినిమాని వీలయినంత పొందిగ్గా... ఫ్లో మిస్‌ కాకుండా ఎడిట్‌ చేయడం మాత్రం పెద్ద టాస్క్‌. ఎడిటర్‌ ప్రవీణ్‌ తనవంతుగా మనం సినిమాకి ఆసక్తి సడలని గమనంతో అండగా నిలిచాడు. సంభాషణల రచయిత హర్షవర్ధన్‌ తనలోని మెచ్యూర్డ్‌ కోణాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించాడు. రచయితగా నాలుగైదు మెట్లు ఒకేసారి ఎక్కే అవుట్‌పుట్‌ ఇది. 
తన కెరీర్‌లో నాగార్జున ఎప్పుడూ ప్రయోగాలకి వెరవలేదు. కొత్త కథలతో వస్తే రిజల్ట్‌ గురించి ఆలోచించి వెనుకాడలేదు. అందుకే తన తరంలో ఏ హీరోకీ లేనన్ని మెమరబుల్‌ మూవీస్‌ తనకే ఉన్నాయి. మనం సినిమా నిర్మించడానికి మరో నిర్మాత అయితే తటపటాయించే వాడేమో కానీ... నాగార్జునలాంటి టేస్ట్‌ ఉన్న ప్రొడ్యూసర్‌ మాత్రమే కథ వింటూనే దానిని తెరపై చూడగలడు. 
దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ ఇంతకుముందే తన ప్రతిభ చాటుకున్నాడు. మనం సినిమాతో అతను కేవలం ప్రతిభావంతుల సరసన కాదు... భారతీయ చిత్ర పరిశ్రమ చూసిన గొప్ప దర్శకుల సరసన చేరిపోతాడు. ఇలాంటి కథని ఊహించడమే కష్టమంటే... దానిని ఒక దారిన పెట్టడం... అంతే సమర్ధవంతంగా తెర మీదకి తీసుకు రావడం... అన్నిటికీ మించి వినోద భరితంగా తీర్చిదిద్దడం అందరి వల్ల అయ్యే పని కాదు. కేవలం మనంతో మెప్పించడమే కాకుండా సమకాలీన దర్శకులకి విక్రమ్‌ సవాల్‌ విసిరాడు. అంతే కాదు... దర్శకుడిగా తనకి కూడా హై స్టాండర్డ్స్‌ సెట్‌ చేసుకున్నాడు. తను విసిరిన సవాల్‌కి బదులివ్వడం ఇతర దర్శకులకి ఎంత కష్టమో... ఇప్పుడు తనకి తాను నిర్దేశించుకున్న ప్రమాణాలకి సరితూగేట్టు మనంని తలదన్నే ఇంకో సినిమా తీయడం విక్రమ్‌కీ అంతే కష్టం. ‘మే 23న మనం కలుద్దాం’ అంటూ ఊరించిన విక్రమ్‌ మలి సినిమా ఎప్పుడొస్తుందా అని మనం ఎదురు చూద్దాం. 
హైలైట్స్‌:
  •      కథ, కథనం
  •      సంగీతం, ఛాయాగ్రహణం
  •      అక్కినేని హీరోలంతా కలిసి నటించడం
  •      నాగార్జున - సమంత కాంబినేషన్‌లోని సీన్స్‌
  •      నాగేశ్వరరావు - చైతన్య మధ్య డైలాగ్స్‌
  •      ప్రెక్షకుడు ముందు సన్నివేశాన్ని ఊహించడానికి కూడా ఉదాహరణ లేకపోవడం.
డ్రాబ్యాక్స్‌:
  •      చైతన్య, సమంత గతం తెలుసుకునే సీన్స్‌ ఎఫెక్టివ్‌గా లేవు
  •      పోసాని, అలీపై తీసిన సీన్స్‌లో కామెడీ పండలేదు
విశ్లేషణ:
మూడు తరాల అక్కినేని హీరోల్ని పెట్టి ఇతనేం సినిమా తీసాడా అనుకున్న వారికి ‘మనం’ అడుగడుగునా సర్‌ప్రైజ్‌ ఇస్తుంది. పాత్రల పేర్లు దగ్గర్నుంచీ... వాటిని రిలేట్‌ చేసి తీరు వరకు దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ తానొక జీనియస్‌నని చూపించాడు. కథగా ఆలోచించడానికి కూడా అసాధ్యమనిపించే దానిని తెరపైకి ఇంత అందంగా తీసుకు రాగలిగాడంటే... విక్రమ్‌ సామాన్యుడు కాదు. అతను ఈ కథ చెప్పినప్పుడు నాగార్జునకి ఎలా అనిపించిందో... ఏం కనిపించిందో కానీ దర్శకుడి మీద పూర్తి నమ్మకం ఉంటే తప్ప ఎవరూ ఈ కథపై ఇంత కాన్ఫిడెంట్‌గా ఇన్వెస్ట్‌ చేయలేరు. ముందుగా ఈ ఆలోచనని సమర్ధనీయంగా తెరకెక్కించిన దర్శకుడిని, ఇది తెరకెక్కడానికి కారణమైన నిర్మాతని మెచ్చుకోవాలి.
తెలుగులో అన్నీ రొటీన్‌ సినిమాలే వస్తుంటాయని... తెలుగు దర్శకులు కొత్తగా ఆలోచించరని అనే వారికి ‘మనం’ తిరుగులేని ఆన్సర్‌గా నిలుస్తుంది. తెలుగు తెర మీదే కాదు.. భారతీయ చిత్ర పరిశ్రమలో వచ్చిన చిత్రాల్లో ‘మనం’ ఒక స్పెషల్‌ మూవీ అనిపించుకుంటుంది. అత్యంత క్లిష్టమైన కథాంశాన్ని దర్శకుడు చాలా సింప్లిఫై చేసి.. అందరికీ అర్థమయ్యేలా తెరకెక్కించిన విధానం అబ్బుర పరుస్తుంది. మనుషుల మధ్య బంధాలు జన్మ జన్మలకీ కొనసాగితే ఎలా ఉంటుందనే ఆలోచనలోంచి పుట్టిన మనంకి అద్భుతమైన కథనం రాసుకున్నాడు దర్శకుడు. క్లాక్‌ టవర్‌... పది ఇరవై టైమ్‌కి లింక్‌ చేస్తూ అతను ఆడిన ప్లే విశేషంగా ఆకట్టుకుంటుంది. 
ఎమోషన్స్‌తో నిండిన ఈ చిత్రాన్ని ఎక్కడా భారం కాకుండా నడిపించడం మరో ఆర్టు. ఆద్యంతం వినోద భరితంగా సాగిన మనం ఓవైపు హృద్యమైన సన్నివేశాలతో మనసు తడుపుతూనే... పెదాలపై చిరునవ్వుని చెరగనీయకుండా చివరంటా అలాగే ఉంచేస్తుంది. రొమాంటిక్‌ సీన్స్‌ అన్నీ చాలా బాగున్నాయి. ముఖ్యంగా నాగార్జున, శ్రియల మధ్య సీన్స్‌ చాలా క్యూట్‌గా అనిపిస్తాయి. నాగార్జున, సమంత మధ్య సన్నివేశాలు, సంభాషణలు... చైతన్య, నాగేశ్వరరావు మధ్య అల్లర్లు, సరదాలు.. ‘మనం’ని ఫుల్‌ టైమ్‌ ఎంటర్‌టైనర్‌గా మలిచాయి. దర్శకుడి మేథస్సుకి లీడ్‌ క్యారెక్టర్స్‌ మధ్య ఉన్న రియల్‌ లైఫ్‌ కెమిస్ట్రీ కూడా తోడైతే దాని ఎఫెక్ట్‌ ఎలాగుంటుందనేది మనంతో తెలుస్తుంది. ముందే చెప్పినట్టు మనం ఒక సగటు సినిమా కాదు... విశ్లేషణలతో అదెలాగుందనేది వివరించడానికి. ఇదొక ఎక్స్‌పీరియన్స్‌... ఎవరికి వారు స్వయంగా అనుభవించి తెలుసుకోవాల్సిందే. 
బోటమ్‌ లైన్‌: ‘మనసున్న ప్రతి మనిషి చూడవలసిన  చిత్రం మనం.!

REVIEW@MEGA CREATIONS-G.S.KUMAR