తన తండ్రి చిరంజీవి కథానాయకుడుగా రూపొందనున్న 150వ చిత్రంలో తాను కనీసం ఒక్క సన్నివేశంలోనైనా కనిపించే ప్రయత్నం చేస్తానని యువ కథానాయకుడు రామ్‌చరణ్ అంటున్నారు. చిరంజీవి నటించనున్న 150వ చిత్రం ఇంకా పూర్తిస్థాయి వివరాలు బయటికి రాలేదు. ఎలాంటి కథను ఎన్నుకోవాలి? దర్శకుడు ఎవరు? అన్న కథనాలపై ఇంకా మల్లగుల్లాలు సాగుతున్నాయి. సరైన కథ దొరికితే తాను తండ్రితో కలిసి నటించడానికి ఎటువంటి అభ్యంతరం లేదని, ఒక్క సీన్‌లో అయినాసరే కనిపిస్తానని, ఎందుకంటే ఆ చిత్రం తన తండ్రి సినీ ప్రయాణంలో ఓ మైలురాయి వంటిదని ఆయన అభివర్ణించారు. అంతేకాకుండా ఈ చిత్రాన్ని తమ సొంత సంస్థలో రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నామని, మంచి కథ వినిపించినవారికి కోటి రూపాయలైనా ఇవ్వడానికి అభ్యంతరం లేదని ఆయన చెబుతున్నారు.
No comments:
Post a Comment