Wednesday, 9 July 2014

రివ్యూ : దృశ్యం

మ‌ల‌యాళంలో ఘ‌న విజ‌యం సాధించిన దృశ్యం చిత్రానికి యాజ్ ఇట్ ఈజ్‌.. రీమేక్ ఈ సినిమా! తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఓ స‌రికొత్త థ్రిల్‌ని ప‌రిచ‌యం చేస్తున్న దృశ్యం.విక్టరీ వెంకటేష్ తాజాగా నటించిన దృశ్యం ఈ నెల 11వ తారీకు విడుదలకు సిద్దమైంది అయితే ఈ చిత్రం ప్రివ్యు షో ఈ రోజు ప్రదర్శించారు చిత్రం ఫస్ట్ హాఫ్ కొంచం లెంత్ ఎక్కువ అయినట్లు అనిపిచ్చినట్లు వున్నా సెకండ్ హాఫ్ మాత్రం అదిరిపోయే రేంజ్ లో వుంది.వెంకీ నటన గురించి మాట్లాడాలంటే మాటల్లో చెప్పలేనంత అద్బుతంగా నటించాడు ,కుటుంభ సమేతంగా అందరూ చూడదగ్గ మంచి సినిమా ఇది..

మ‌ల‌యాళ దృశ్యం సినిమాని ఎలాంటి మార్పులు లేకుండా యాజ్ ఇట్ ఈజ్ గా ఫాలో అయిపోవ‌డం. వెంకీతో స‌హా చిత్ర బృందం అంతా క‌థ‌ని న‌మ్మారు. దాని ఫ‌లితం అడుగడుగునా క‌నిపిస్తుంటుంది. ఇది బేసిగ్గా ఓ థ్రిల్ల‌ర్‌. త‌ర‌వాత ఏం జ‌రుగుతుందా??  అనే  ఆస‌క్తి… క‌లిగిస్తుంటుంది. అయితే ఈ థ్రిల్ల‌ర్‌ని ఓ ఫ్యామిలీ డ్రామాకి షిప్ట్ చేయ‌డం వ‌ల్ల క‌థ‌లో కొత్త‌ద‌నం వచ్చింది. క‌థ‌లోకి ఎంట‌ర్ అవ్వ‌డానికి కాస్త స‌మ‌యం తీసుకొంది ద‌ర్శ‌కురాలు. తొలి అర‌గంట‌… రాంబాబు మ‌న‌స్త‌త్వం, ఆ ఊరి వ్య‌వ‌హారాలు, కానిస్టేబుల్‌తో గొడ‌వ‌, త‌న మ‌ధ్య‌త‌ర‌గ‌తి మ‌న‌స్త‌త్వం… వీటిని ట‌చ్ చేసుకొంటూ న‌డిచింది.

క‌థ‌లో ఏం లేదేంటి..??  అని ప్రేక్ష‌కుడు ఫీల్ అవ్వ‌కుండానే…. క‌థ‌లో వేగం పెంచి, ప్రేక్ష‌కుడి అసంతృప్తిని దూరం చేసింది శ్రీ‌ప్రియ‌. ఎప్పుడైతే సెల్‌ఫోన్ బ్లాక్‌మెయిల్ ఎపిసోడ్ ప్రారంభం అయ్యిందో అప్ప‌టి నుంచీ… క‌థ జెడ్ స్పీడ్‌తో న‌డుస్తుంటుంది. ఓ థ్రిల్లింగ్ పాయింట్ ద‌గ్గ‌ర క‌థ‌కు ఇంట్ర‌వెల్ కార్డు వేశాడు. ఇంట్ర‌వెల్ త‌ర‌వాత‌… క‌థ మ‌రింత స్పీడ్ అందుకొంటోంది. స్ర్కీన్ ప్లే ఎంత బాగా కుదిరిందంటే… సెకండాఫ్‌లో ఒక్క‌టంటే ఒక్క‌సీన్ కూడా తీసి ప‌క్క‌న పెట్ట‌డానికి లేకుండా పోయింది. నిడివి త‌గ్గించ‌డం కోసం ఒక్క సీన్ ప‌క్క‌న పెట్టినా క‌థ ఆర్డ‌ర్ మారిపోతుంది. అంత‌లా… స్ర్కీన్ ప్లే టైట్‌గా రాసుకొన్నారు.

పాజిటివ్ పాయింట్స్: 

  • ఆకట్టుకునే కథ,

  • భావోద్వేగానికి గురి చేసే డైలాగ్స్

  • బ్యాక్ గ్రౌండ్ స్కోర్

నెగిటివ్ పాయింట్స్:

  • స్క్రీన్ ప్లే,

  • ఎడిటింగ్,

  • సినిమాటోగ్రఫి

అయితే ఈ చిత్ర తొలి భాగంలోనూ, రెండవ భాగంలోనూ కథనంలో వేగం మందగించడం ప్రేక్షకుడ్ని కొంత అసహనానికి గురి చేసేలా ఉంది.  ఎడిటింగ్ కు దర్శకురాలు ఇంకాస్త పదను పెట్టి ఉంటే కథనంలో వేగం మరింత పెరిగేదనే ఫీలింగ్ కలిగింది. కెమెరా పనితనం గొప్పగా లేకున్నా.. ఓకే రేంజ్ లో ఉంది. అక్కడక్కడా తడబాటుకు గురైనా.. సస్పెన్స్, థ్రిలింగ్ అంశాలు పక్కదారి పట్టకుండా జాగ్రత్త వహించారు. అయితే క్లైమాక్స్ లో ఈ చిత్రాన్ని గాడిలో పెట్టడమే కాకుండా.. ప్రేక్షకుడికి పూర్తి స్థాయి సంతృప్తిని పంచడంలో దర్శకురాలు శ్రీప్రియ సఫలమయ్యారు.  ఈ చిత్రంలో కొన్ని లోపాలున్నా.. సానుకూల అంశాలు ఎక్కువగా డామినేట్ చేశాయి. ఓవరాల్ గా ఈ మధ్యకాలంలో వచ్చిన చిత్రాలతో పోల్చుకంఉటే  ‘దృశ్యం’ ఓ ఫీల్ గుడ్ చిత్రంగా నిలవడం ఖాయం.


No comments:

Post a Comment