కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న ‘గోవిందుడు అందరి వాడేలే’ చిత్రం ఆడియో వేడుకకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా పాటల పండుగను ఆగస్ట్ 20న హైదరాబాదులో అభిమానుల సమక్షంలో నిర్వహిస్తారు. కాగా, ఈ చిత్రం ట్రైలర్ ను ఈ నెల 28న దర్శకుడు కృష్ణవంశీ జన్మదినం సందర్భంగా రిలీజ్ చేయడానికి నిర్ణయించారు. ఇక షూటింగు విషయానికి వస్తే, ఇప్పటికే చాలా వరకు పూర్తయింది. త్వరలో లండన్ షెడ్యూల్ ను నిర్వహిస్తారు. చరణ్ సరసన కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో చరణ్ తండ్రిగా రెహ్మాన్, తాతగా ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు.
No comments:
Post a Comment