బాలీవుడ్ ‘కిక్’ ఐదు వేల థియేటర్లలో విడుదల కానుంది. భారతదేశంలోనే అత్యధిక థియేటర్లలో సినిమాని విడుదల చేస్తోన్న చిత్ర నిర్మాతలు, విదేశాల్లోనూ కనీ వినీ ఎరుగని రీతిలో ఈ సినిమాని అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. మామూలుగా అమెరికా తదితర దేశాల్లోనే ఎక్కువగా మన సినిమాలు విడుదలవుతుంటాయి. ఈసారి ‘కిక్’ని జర్మనీ, మొరాకో, ఫ్రాన్స్, మాల్దీవుల్లోనూ విడుదల చేస్తుండడం గమనార్హం. తెలుగులో రవితేజ, ఇలియానా జంటగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘కిక్’ సినిమానే హిందీలో సల్మాన్‌ఖాన్ హీరోగా అదే పేరుతో రీమేక్ చేసిన విషయం విదితమే. సల్మాన్‌ఖాన్ సరసన శ్రీలంక బ్యూటీ జాక్వెలైన్ ఫెర్నాండెజ్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. భారీ బడ్జెట్‌తో, తెలుగు ‘కిక్’ కన్నా పదింతల కిక్ ఇచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించారట. సాజిద్ నడియడ్‌వాలా ఈ హిందీ ‘కిక్’ చిత్రానికి దర్శకుడు. తొలిరోజు, తొలివారం రికార్డుల్ని ఇంకెవరూ ఇప్పట్లో టచ్ చేయని రీతిలో ‘కిక్’ క్రియేట్ చేస్తుందన్నది చిత్ర యూనిట్ నమ్మకం. మొత్తం 42 దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండడంతో రికార్డులు ఏ రేంజ్‌లో వుంటారో ఊహించడమే కష్టమని బాలీవుడ్ సినీ జనం అనుకుంటున్నారట.
No comments:
Post a Comment