Friday, 6 June 2014

సుకుమార్ దర్శకత్వంలో బన్నీ !

ఇటీవలే ‘రేసుగుర్రం’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యాడు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. అయితే ఈ సినిమా తర్వాత తమ సొంత సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ ని బన్నీ ఓ సినిమా చేయమన్నాడు. విశేషం ఏమిటంటే , ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించనున్నాడట. గతంలో గీతా ఆర్ట్స్ కి ’100% లవ్’ వంటి హిట్ సినిమాని చేసిన సుకుమార్  ఈ నేపధ్యంలో అల్లు అరవింద్ ఈ దర్శకుడికి పిలిచి మరీ అవకాశం ఇచ్చాడట. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని , త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా పూర్తయ్యాక ఇది మొదలవుతుందని సమాచారం. ఇటీవలే బన్నీ ఓ కుమారుడికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. దాంతో ప్రస్తుతం అల్లు అర్జున్ ఫుల్ హ్యాపీ గా ఉన్నాడు

No comments:

Post a Comment