సంక్రాంతికిపోటీ పడిన ఆ హీరోలిద్దరూ ఇప్పుడు దసరా రేసులో పోటీ పడుతున్నారు. రామ్ చరణ్ లేటెస్ట్ సినిమా గోవిందుడు అందరివాడే అక్టోబర్ 1న విడుదల కానుంది. ఇక ప్రిన్స్ మహేష్ ఆగడు సినిమా కూడా సెప్టెంబర్ 26న రిలీజ్ కానున్నట్లు ఇప్పటికే టాలీవుడ్-లో టాక్ నడుస్తోంది. ఈ పెద్ద హీరోల మధ్యలో మరో మెగా హీరో వరుణ్ తేజ్ సినిమా గొల్లభామ కూడా రిలీజ్ కాబోతోంది. ఇలా ప్రిన్స్-కి పోటీ ఇచ్చేందుకు మెగా హీరోలు రెడీ అయ్యారని టాలీవుడ్-లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సంక్రాంతి రేసులో ఎవడుతో ముందు నిలిచిన రామ్ చరణ్ , ఫ్యామిలీ మూవీతో దసరా రేసులోనూ మహేష్-ని వెనక్కి నెట్టాలని చూస్తున్నాడట. మరోవైపు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ కూడా మహేష్-కు పోటీగా నిలవాలని చూస్తున్నాడట. ఈ మెగా హీరోల ఉచ్చును ప్రిన్స్ ఛేదించి విజయం అందుకుంటాడా లేడా అన్నది దసరా హిట్ తేలుస్తుంది
No comments:
Post a Comment