అద్భుతమైన కథ, కథనాలతో ‘మనం’ చిత్రాన్ని రూపొందించి ప్రశంసలు అందుకుంటున్న దర్శకుడు విక్రంకుమార్ కి చాలా ఆఫర్లు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం మహేష్ బాబు తనకో కథ చెప్పమని విక్రంని అడిగాడట. ఈ విషయాన్ని ఈ రోజు నాగార్జున వెల్లడించారు. “మనం సినిమా చూసి మహేష్ ఫోన్ చేసి చాలా సేపు మాట్లాడాడు. అసలు ఇంతటి సంక్లిష్టమైన కథను ఎలా జడ్జ్ చేయగలిగారని అడిగాడు. తను కూడా విక్రం చెప్పే కథ ఒకటి వింటున్నాననీ, అది నన్ను కూడా వినమని చెప్పాడు” అని చెప్పారు నాగార్జున. సో… త్వరలో మహేష్ -విక్రం కాంబోలో సినిమా ఎక్స్ పెక్ట్ చేయచ్చు!
No comments:
Post a Comment