రుబాబుగా జూనియర్ బాబు
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందించాడు. గతంలో ‘కుమ్మెస్తా’ టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ‘రుబాబు’ అనే టైటిల్ తెరపైకి వచ్చింది. మరి ఈ టైటిల్ అయినా ఫైలన్ అవుతుందో? లేదో? త్వరలో తేలనుంది. ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మించనున్నారు. గతంలో జూ ఎన్టీఆర్ ‘బాద్ షా’ చిత్రాన్ని నిర్మించి హిట్ కొట్టిన గణేష్ ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్‌తో చేసే ఛాన్స్ రావడంపై ఆనందంగా ఉన్నాడు.
వాస్తవానికి….మహేష్ బాబు-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో సినిమాను చేయడానికి రెడీ అయ్యాడు బండ్ల గణేష్. అయితే ఇతర ప్రాజెక్టుల ఇచ్చిన కమిట్మెంట్స్ వల్ల పూరి జగన్నాథ్‌తో చేయాల్సిన సినిమాను హోల్డ్‌లో పెట్టాడు మహేష్ బాబు. ఆయనతో సినిమా చేయడానికి చాలా సమయం ఉండటంతో ఈ లోగా జూ ఎన్టీఆర్‌తో ఓ సినిమా ప్లాన్ చేసాడు పూరి. ఈ సినిమాను నిర్మించే అవకాశం కూడా బండ్ల గణేష్‌కే ఇచ్చాడు.
No comments:
Post a Comment