Saturday, 7 June 2014

పవన్ వెంకీల గోపాలా...గోపాలా

పవన్ కళ్యాణ్, వెంకటేష్ కాంబినేషన్లో హిందీ సూపర్ హిట్ మూవీ ‘ఓ మై గాడ్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలసిందే. ఈ చిత్రానికి ‘దేవ దేవం భజే’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రానికి ‘గోపాలా గోపాలా’ అనే టైటిల్ ఖరారు చేసే యోఛనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో అఫీషియల్ సమాచారం వెలువడనుంది.

 ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక దాదాపుగా పూర్తయింది. వెంకీ జోడీగా శ్రీయను ఎంపిక చేసారు. అదే విధంగా వెంకీ అసిస్టెంట్ పాత్రకు కృష్ణుడిని తీసుకున్నారు. ఇప్పటికే రామానాయుడు సినీ విలేజ్‌లో సినిమాకు సంబంధించిన మార్కెట్ సెట్ సైతం వేసారు. మరికొన్ని రోజుల్ల సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ‘ఓ మై గాడ్’ ఒరిజినల్ వెర్షన్లో మిథున్ చక్రవర్తి లీలాధర్ స్వామిజీ పాత్రలో నటించారు. తెలుగులో వెర్షన్లోనూ ఆయన అదే పాత్ర పోషిస్తారని తెలుస్తోంది.

No comments:

Post a Comment