కృష్ణవంశీ రామ్ చరణ్ సినిమాను అప్పుడే క్లైమాక్స్ కు తీసుకొచ్చాడట.ఒకపక్క మళ్ళీ రీషూటింగ్ కి వెళ్లిందని ప్రచారం జరుగుతుండగానే నిర్మాత బండ్ల గణేష్ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించేశాడు. గోవిందుడు అందరివాడేలే టైటిల్ ను కన్ఫర్మ్ చేసిన ఈ సినిమా ప్రస్తుతం చెర్రీకి సంబంధించిన షూటింగ్ జరుగుతుండగా ఇప్పటికే మిగతా టాకీ పార్ట్ పూర్తి చేశారట. ఇక త్వరలో పాటల షూటింగ్ కూడా పూర్తి చేసి అక్టోబరు 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.
రామ్ చరణ్-కాజల్, శ్రీకాంత్-కమలిని ముఖర్జీ జంటలుగా నటించిన ఈ సినిమాలో ప్రకాష్‌రాజ్, జయసుధ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను ఎట్టి పరిస్థితిలో కూడా అక్టోబరు 1న ఉదయం 5గంటలకు ఫస్ట్ షో పడబోతోందని బండ్ల గణేష్ గ్యారంటీగా చెప్పాడు. కాగా రీషూటింగ్ జరిగిందని నిజమేనని ఒప్పుకున్నా బండ్ల అది పూర్తిగా తన నిర్ణయమేనని చెబుతున్నాడు. రాజ్ కిరణ్ స్థానంలో ప్రకాష్ రాజ్ ని తీసుకోవడం వలన కేవలం ఎనిమిది రోజులు మాత్రమే రీషూట్ చేయాల్సివచ్చిందని బండ్ల నిర్భయంగా ఒప్పుకున్నాడు!
No comments:
Post a Comment