Wednesday, 25 June 2014

గోవిందుడు అందరివాడేలే రషేస్ చూసి తెగ ఆనంద పడుతున్న బండ్లగణేష్ బాబు

ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న టాప్ నిర్మాతల్లో బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ కూడా ఒకరు. అయన నిర్మించే ప్రతి సినిమా చాలా రిచ్ గా ఉండాలని , తెలుగు ప్రేక్షకులకు విజువల్స్ తో సరికొత్త అనుభూతిని అందించే ఉద్దేశ్యంతో భారీ బడ్జెట్ తో సినిమాలను నిర్మిస్తారు. ప్రస్తుతం బండ్ల గణేష్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాని నిర్మిస్తున్నాడు.ఈ సినిమా కూడా తన నిర్మాణ కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని బండ్ల గణేష్ గట్టిగా చెబుతున్నాడు. ఇప్పుడే గోవిందుడు అందరివాడేలే రషెన్ చూశాను. అద్భుతంగా ఉన్నాయి. మా లిటిల్ స్టార్ మరియు కృష్ణవంశీకి థాంక్స్. ఇవి చూశాకా నా పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పై మరో బ్లాక్ బస్టర్ హిట్ రానున్నదని గర్వంగా అనౌన్స్ చేస్తున్నాను అని బండ్ల గణేష్ ట్విట్ చేశాడు.రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ , శ్రీకాంత్ , జయసుధ , కమలిని ముఖర్జీ కీలకపత్రాల్లో నటిస్తున్నారు. యువన్ శంకర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానున్నది. 

అల్లుడు శీను ఆడీయో వేడుకలు

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తన కుమారుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని హీరోగా పరిచయం చేస్తూ చేసిన సినిమా ‘అల్లుడు శీను’.సక్సెస్ఫుల్ టాలీవుడ్ కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆడియో ఈనెల 29న శిల్పకళావేదికలో ఘనంగా జరగనుంది.

Sunday, 15 June 2014

అక్టోబర్ 1 ఉదయం 5 గంటల 9 నిమిషాలకి రిలీజ్ కానున్న గోవిందుడు అందరివాడేలే




కృష్ణవంశీ రామ్ చరణ్ సినిమాను అప్పుడే క్లైమాక్స్ కు తీసుకొచ్చాడట.ఒకపక్క మళ్ళీ రీషూటింగ్ కి వెళ్లిందని ప్రచారం జరుగుతుండగానే నిర్మాత బండ్ల గణేష్ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించేశాడు. గోవిందుడు అందరివాడేలే టైటిల్ ను కన్ఫర్మ్ చేసిన ఈ సినిమా ప్రస్తుతం చెర్రీకి సంబంధించిన షూటింగ్ జరుగుతుండగా ఇప్పటికే మిగతా టాకీ పార్ట్ పూర్తి చేశారట. ఇక త్వరలో పాటల షూటింగ్ కూడా పూర్తి చేసి అక్టోబ‌రు 1న విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నారట.
రామ్ చరణ్-కాజల్, శ్రీకాంత్-కమలిని ముఖర్జీ జంటలుగా నటించిన ఈ సినిమాలో ప్ర‌కాష్‌రాజ్‌, జ‌య‌సుధ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్న ఈ సినిమాను ఎట్టి పరిస్థితిలో కూడా అక్టోబ‌రు 1న ఉద‌యం 5గంట‌ల‌కు ఫ‌స్ట్ షో ప‌డ‌బోతోందని బండ్ల గణేష్ గ్యారంటీగా చెప్పాడు. కాగా రీషూటింగ్ జరిగిందని నిజమేనని ఒప్పుకున్నా బండ్ల అది పూర్తిగా తన నిర్ణయమేనని చెబుతున్నాడు. రాజ్‌ కిర‌ణ్‌ స్థానంలో ప్ర‌కాష్‌ రాజ్‌ ని తీసుకోవ‌డం వలన కేవలం ఎనిమిది రోజులు మాత్ర‌మే రీషూట్ చేయాల్సివ‌చ్చిందని బండ్ల నిర్భయంగా ఒప్పుకున్నాడు! 

రామ్ చరణ్ పై మనసు పడిన బాలివుడ్ అతిలోక సుందరి!


బాలీవుడ్ ముద్దు గుమ్మలు దక్షిణ చిత్ర పరిశ్రమలో ఎప్పుడెప్పుడు నటించుదామా అని ఎదురు చూస్తూ ఉంటారు. దానికి కారణం లేకపోలేదు. దక్షిణాదిన ప్రేక్షకులు నటి నటులను తమ కుటుంబ సభ్యులు గా భావించి అమితమైన ప్రేమ ను కురిపిస్తుంటారు. అందుకే వారు ఎప్పుడెప్పుడు ఇటు వైపు వద్దామా అని ఆశ తో ఎదురు చూస్తూ ఉంటారు. సాధారణం గా అలా ఎదురు చూసే వారిలో అత్యధిక మంది కొన్ని కొన్ని గొంతెమ్మ కోరికల తో తయారు గా ఉంటారు. మాజీ మిస్ ఇండియా ఇషా గుప్తా కుడా ఇలాంటి ఆశలతో నే దక్షిణాది పై ఒక చూపు వేసి ఉంచింది. కానీ ప్రత్యేకించి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పక్కన మాత్రమే నటిస్తాను అని మనసులో ని కోరికను బయట పెట్టింది. “దక్షిణాది పరిశ్రమ లో పని చేయడానికి ఉత్సాహంగా ఉన్నాను, తమిళం లో సూర్య పక్కన నటించాలని ఉంది. అలాగే నేను రామ్ చరణ్ కి వీరాభిమాని ని. ఒక్క సారి అయిన తన పక్కన నటించాలి అని ఎదురు చూస్తున్నాను” అని కోరికల చిట్టా విప్పింది. ఇషా కి తమన్నా మంచి స్నేహితురాలు. తమన్నా చరణ్ సరసన రచ్చ చేసింది. ఇషా కోసం తమన్నా చరణ్ పక్కన అవకాశం కలిపిస్తుందేమో అని వేచి చూడాలి...

చెర్రిని మహేష్ ని డీ కొట్టనున్న వరుణ్ తేజ్

సంక్రాంతికిపోటీ పడిన ఆ హీరోలిద్దరూ ఇప్పుడు దసరా రేసులో పోటీ పడుతున్నారు. రామ్‌ చరణ్‌ లేటెస్ట్‌ సినిమా గోవిందుడు అందరివాడే అక్టోబర్‌ 1న విడుదల కానుంది. ఇక ప్రిన్స్‌ మహేష్‌ ఆగడు సినిమా కూడా సెప్టెంబర్‌ 26న రిలీజ్‌ కానున్నట్లు ఇప్పటికే టాలీవుడ్‌-లో టాక్‌ నడుస్తోంది. ఈ పెద్ద హీరోల మధ్యలో మరో మెగా హీరో వరుణ్‌ తేజ్‌ సినిమా గొల్లభామ కూడా రిలీజ్‌ కాబోతోంది. ఇలా ప్రిన్స్‌-కి పోటీ ఇచ్చేందుకు మెగా హీరోలు రెడీ అయ్యారని టాలీవుడ్‌-లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సంక్రాంతి రేసులో ఎవడుతో ముందు నిలిచిన రామ్‌ చరణ్‌ , ఫ్యామిలీ మూవీతో దసరా రేసులోనూ మహేష్‌-ని వెనక్కి నెట్టాలని చూస్తున్నాడట. మరోవైపు నాగబాబు కుమారుడు వరుణ్‌ తేజ్‌ కూడా మహేష్‌-కు పోటీగా నిలవాలని చూస్తున్నాడట. ఈ మెగా హీరోల ఉచ్చును ప్రిన్స్‌ ఛేదించి విజయం అందుకుంటాడా లేడా అన్నది దసరా హిట్‌ తేలుస్తుంది

Monday, 9 June 2014

పట్టాలెక్కనున్న చిరు 150 వ సినిమా


పెయింటర్ అయిన పవన్ కూతురు !

పవన్ పిల్లలు తమ తల్లి రేణుదేశాయ్ దగ్గర సమ్మర్ హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో రేణు బాలీవుడ్ లో తీస్తున్న ‘ఇష్క్ వాలా లవ్’ సినిమా హీరో అదినాత్ దగ్గర పెయింటింగ్ నేర్చుకుంటూ తన ప్రతిభను మెరుగు పరుచు కుంటోOదట పవన్ ముద్దుల కూతురు ఆధ్యా. ఈ చిన్నారి క్రియేటివిటీకి ‘ఇష్క్ వాలా లవ్’ సినిమా యూనిట్ అంతా ఆశ్చర్య పోతున్నారట. ఇప్పటిదాకా మెగా కుటుంబంలో వరుస పెట్టి వస్తున్న హీరోలను చూసాం. ఇక రానున్న కాలంలో కొణిదల కుటుంబం నుండి రకరకాల కళల నైపుణ్యంతో రాబోయే కొత్త తరం కళాకారులను మెగా కుటుంబం నుండి చూడబోతున్నాం అనుకోవాలి.

రాబోతున్న కాలంలో తండ్రి పవన్ రాజకీయాల దిశను మార్చే నాయకుడిగా ఎదిగితే సున్నిత భావాలను వ్యక్త పరిచే పెయింటర్ గా ఆధ్యా రూపొందుతుందని అనుకోవాలి. త్వరలో రాజకీయాలు పక్కకు పెట్టి తిరిగి కెమెరా ముందుకు రాబోతున్న పవన్ కళ్యాణ్ సినిమాల జోష్ తో పాటు పవన్ కూతురుకు సంబంధించిన ఈ న్యూస్ కూడ పవన్ అభిమానులను జోష్ లో ముంచెత్తేస్తుంది అని అనుకోవాలి.