Wednesday, 27 May 2015
Friday, 29 August 2014
సినిమా రివ్యూ: రభస
ప్లస్ పాయింట్స్:
జూనియర్ ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్
సమంత, ప్రణీత గ్లామర్,
బ్రహ్మానందం కామెడీ
మైనస్ పాయింట్స్:
రొటిన్ కథ, పేలవమైన కథనం
మితిమీరిన ఫైట్స్
ఓ అమ్మాయి ప్రేమను కాపాడే పయత్నంలో మరో అమ్మాయి పెళ్లి ఆగిపోవడానికి కారణమవుతాడు కార్తీక్(జూనియర్ ఎన్టీఆర్). తన తండ్రి(నాజర్) అవమానించిన తన మేనమామ ధనుంజయ్ (షియాజీ షిండే) బుద్ది చెప్పి, తన తల్లి కోరిక మేరకు తన మరదలు చిట్టి అలియాస్ ఇందు(సమంత)ను పెళ్లి చేసుకోవాలని హైదరాబాద్ చేరుకుంటారు. తన మరదలు అని తెలియకపోవడంతో మొదటి కలయికలోనే ఇందు,కార్తీక్ ల మధ్య విభేదాలు చోటు చేసుకుంటాయి. తన మరదలిని ప్రేమలోకి దించే ప్రయత్నంలో భాగ్యం(ప్రణితి)ను ఇందుగా భావించి ప్రేమలోకి దింపుతాడు. కార్తీక్ చెడ్డవాడు అనే భావనలో ఉన్న ఇందు..వారిద్దరి విడగొడుతుంది. భాగ్యంతో ప్రేమను విడగొట్టిన ఇందు అప్పటికే తనకు తెలియని వ్యక్తితో ప్రేమలో పడుతుంది. తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్న తన తండ్రి ప్రయత్నాలకు దూరంగా పారిపోవడానికి కార్తీక్ తో ప్రేమలో ఉన్నట్టు నాటకం ఆడుతుంది. కథ ఇలా నడుస్తుండగా.. పెద్దిరెడ్డి (జయప్రకాశ్) ఓబుల్ రెడ్డి (అజయ్)ల గ్యాంగ్ కార్తీక్ కోసం వెదుకుతుంటారు. ఓదశలో కార్తీక్, ఇందులు పెద్దిరెడ్డి ఇంట్లోకే చేరుతారు. తనను వెతుకున్న విలన్ల ఇంటికి చేరిన కార్తీక్ ఏం చేశాడు. ఇందు తన మరదలే అని తెలుసుకున్నాడా? తెలియని వ్యక్తితో ప్రేమలో పడిన ఇందు తన ప్రేమికుడిని కలుసుకుందా? పెద్దిరెడ్డి, ఓబుల్ రెడ్డిలు కార్తీక్ ను ఎందుకు వెతుకుతున్నారు? అయితే ఇందు తన మరదలు అని తెలుసుకుంటాడా? తన కారణంగా ఓ అమ్మాయి పెళ్లి ఆగిపోయిందని తెలుసుకున్న కార్తీక్ ఏం చేశాడు? తన మామ ధనుంజయ్ ను ఎలా కన్విన్స్ చేసి ఇందును పెళ్లి చేసుకున్నాడా? అనే పలు ప్రశ్నలకు సమాధానమే 'రభస'
ప్రేమికుడిగా, ఆపదలో ఉన్న వారిని ఆదుకునే ఓ వ్యక్తిగా, తన తల్లిని మాటను తీర్చే కోడుకుగా, పగ ప్రతీకారంతో రగిలిపోతున్న రెండు ఫ్యాక్షన్ల కుటుంబాలను కలిపే మనసున్న మనిషిగా, తన మేనమామకు తగిన గుణపాఠం నేర్పే అల్లుడిగా.. పలు విభిన్న షేడ్స్ ఉన్న కార్తీక్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించడమే కాకుండా పూర్తిగా న్యాయం చేశాడు. గత కొద్దికాలంగా సరైన హిట్ లేని.. జూనియర్ ఎన్టీఆర్.. ప్రయోగాలకు చోటివ్వకుండా చాలా సేఫ్ గా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఎప్పటిలానే ఫైట్స్, డ్యాన్స్, అభినయం, ఎమోషనల్ సీన్లలో మెప్పించాడు.
సమంత పాత్ర ప్రధానంగా గ్లామర్ కే పరిమితమైన, కీలక సన్నివేశాల్లో పర్వాలేదనిపించింది. ప్రణీత రెండో హీరోయిన్ గా కనిపించి.. కథానుగుణంగా కనిపించి మాయమవుతుంది. ప్రణీత కెరీర్ కు పెద్గగా ప్లస్ అవుతుందని చెప్పడం కష్టమే.
రాజు పాత్రలో కనిపించిన బ్రహ్మనందం రోటిన్ కారెక్టర్ అయినప్పటికి.. ద్వితీయార్ధంలో సినిమా భారాన్ని తనపైనే వేసుకున్నాడు. ఫైట్స్ తో విసిగించే సమయంలో రాజుగా ఎంట్రీ ఇచ్చి.. ప్రేక్షకులకు బ్రహ్మనందం కొంత రిలీఫ్ కలిగించాడు.
జయప్రకాశ్, నాగినీడు, అజయ్, షియాజీ షిండే, నాజర్, జయసుధలు తమ పాత్రల పరిధిమేరకు పర్వాలేదనిపించారు.
సాంకేతిక నిపుణులు పనితీరు:
సాంకేతిక విభాగంలో ముఖ్యంగా శ్యామ్ కే నాయుడును అందించిన ఫోటోగ్రఫి బాగుంది. లోకేషన్లు ఆందంగా చిత్రీకరించి.. రభసకు అదనపు ఆకర్షణగా మారారు. ఈ చిత్ర నిడివి సుమారు 2 గంటల 40 నిమిషాలకు పైనే ఉంది. ఎడిటింగ్ విభాగంలో కోటగిరి వెంకటేశ్వరరావు మరింత పదను పెట్టాల్సిందే. ఓ రెండు పాటలు మినహా తమన్ ప్రభావవంతమైన సంగీతాన్ని అందించలేదనే చెప్పవచ్చు. ఎమోషన్ సీన్స్ లో నేపథ్యం సంగీతంగా అంతగా ఆకట్టుకునే విధంగా లేదనిపిస్తోంది.
'కందిరీగ' చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన సంతోష్ శ్రీనివాస్ రభస కథ, కథనాన్ని చాలా కాంప్లికేటెడ్ పంథాలోనే కొనసాగించాడు. అనేక ట్విస్టులు, గందరగోళంగా ఉండే కథనంతో ప్రేక్షకుడిని అక్కడక్కడా కన్ ఫ్యూజ్ చేస్తుంది. కథాగమనంలో అనేక మలుపులు సహజంగా ఉన్నట్టు ఎక్కడా అనిపించదు. కేవలం కమర్షియల్ ఆంశాలను బేరిజు వేసుకుని కథ, కథనంపై దృష్టిపెట్టారనేది సగటు ప్రేక్షకుడికి అర్ధమవుతుంది. అయితే తొలిభాగంలో ఓపెన్ చేసిన ట్విస్టులకు ద్వితీయార్ధంలో క్లోజ్ చేసిన తీరు, విధానాన్ని మెచ్చుకోవాల్సిందే. చిత్ర ద్వితీయార్ధంలో తీసుకున్న కొన్ని జాగ్రత్తలు దర్శకుడి ప్రతిభకు అద్దపడుతుంది. ప్రస్తుత పరిస్థితులకు తగినట్టుగా ఎలాంటి ప్రయోగాలకు చోటివ్వకుండా టాలీవుడ్ సక్సెస్ ఫార్ములాతో కథను పట్టాలెక్కించి.. సేఫ్ గా గమ్యాన్ని చేర్చేందుకు చేసిన ప్రయత్నం కొంత వర్కవుట్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను, సగటు ప్రేక్షకులను ఉర్రూతలూగించే చిత్రంగా కాకుండా.. ఓ రకమైన సంతృప్తిని కలిగించే చిత్రంగా 'రభస' రూపొందింది. బీ,సీ సెంటర్లలో ప్రేక్షకులు ఆదరణపైనే రభస సక్సెస్, కమర్షియల్ గా ఏరేంజ్ లో వర్కవుట్ అయిందనే అంశాలు అధారపడి ఉన్నాయి.
REVIEW@MEGACREATIONS-G.S.KUMAR
Friday, 1 August 2014
సినిమా రివ్యూ: రన్ రాజా రన్
రివ్యూ: రన్ రాజా రన్
రేటింగ్: 3.25/5
బ్యానర్: యు.వి. క్రియేషన్స్
తారాగణం: శర్వానంద్, సీరత్ కపూర్, సంపత్, అడివి శేష్, వెన్నెల కిషోర్, కోట శ్రీనివాసరావు తదితరులు
సంగీతం: ఘిబ్రాన్ .ఎం
కూర్పు: మధు
ఛాయాగ్రహణం: మధి
నిర్మాతలు: వి. వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి
రచన, దర్శకత్వం: సుజిత్
విడుదల తేదీ: ఆగస్ట్ 1, 2014
ఆకర్షణీయమైన ప్రోమోలు, పోస్టర్లతో ‘రన్ రాజా రన్’ సినీ ప్రియుల దృష్టిలో పడింది. టాలెంట్ ఉన్నా కానీ అందుకు తగ్గ సక్సెస్ సాధించలేకపోతున్న శర్వానంద్ ఈసారి కొత్త దర్శకుడు సుజిత్‌తో ‘మిర్చి’ అందించిన నిర్మాణ సంస్థలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. పబ్లిసిటీతో అంచనాలు పెంచిన ఈ రాజా.. స్క్రీన్‌పై ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడో లేదో చూద్దాం.
కథేంటి? రాజా హరిశ్చంద్రప్రసాద్ (శర్వానంద్) ప్రేమించిన ప్రతి అమ్మాయి హ్యాండిస్తుంటుంది. చాలా మందిని ప్రేమించి విసిగిపోయిన దశలో అతనికి ప్రియ (సీరత్) తారసపడుతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. అయితే ప్రియ ఆ సిటీ పోలీస్ కమీషనర్ (సంపత్) కూతురు. తన కూతురి ప్రేమ విషయం తెలిసిన తర్వాత ఆ కమీషనర్ రాజాకి ఎలాంటి పరీక్ష పెట్టాడు? దాంట్లో రాజా ఎలా నెగ్గుకొస్తాడు?
కళాకారుల పనితీరు: శర్వానంద్ తన పాత్రకి పూర్తి న్యాయం చేసాడు. ఫస్ట్ సీన్ నుంచి ఎనర్జిటిక్‌గా సాగే ఈ పాత్రలో శర్వానంద్ చాలా ఎంటర్‌టైన్ చేసాడు. ఎక్కువగా సీరియస్ రోల్స్ చేసిన శర్వానంద్ ఇందులో తన వయసుకి తగిన చలాకీ యువకుడిగా కనిపించాడు. కామెడీ సీన్స్‌లో కూడా మంచి టైమింగ్‌తో అలరించాడు. సీరత్ కపూర్ బాగానే చేసింది. సంపత్ క్యారెక్టరైజేషన్ బాగుంది. మరీ వయలెంట్‌గా చూపించకుండా ఈ క్యారెక్టర్‌కి కొంచెం ఫన్నీ టచ్ ఇచ్చారు. దాని వల్ల విలన్ పాత్ర కూడా వినోదాన్ని పంచుతుంది. అడివి శేష్ కీలకమైన క్యారెక్టర్ చేసాడు. తన క్యారెక్టర్‌కి అనుగుణంగా బాగా అండర్ ప్లే చేసాడు. కోట శ్రీనివాసరావు గురించి కొత్తగా చెప్పేదేముంది. వెన్నెల కిషోర్, విద్యుల్లేఖ తదితరులు తమకిచ్చిన క్యారెక్టర్స్‌కి తగ్గట్టు నటించారు.
సాంకేతిక వర్గం పనితీరు: ఘిబ్రాన్ అందించిన సంగీతం సినిమాకి అనుగుణంగా ఉంది. సాంగ్స్ ఆడియోలో కంటే స్క్రీన్‌పై ఇంకా బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా సినిమాకి ఎస్సెట్టే. మధి సినిమాటోగ్రఫీ మరో పెద్ద బోనస్. స్క్రీన్ చాలా వెబ్రెంట్‌గా, కలర్‌ఫుల్‌గా కనిపించింది. సాంగ్స్ షూట్ చేయడానికి ఎంచుకున్న లొకేషన్లు ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ పర్‌ఫెక్ట్‌గా ఉంది. సినిమాలో ఎక్కడా ల్యాగ్ అస్సల్లేదు. చిన్న సినిమా అయినా కానీ నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు. క్వాలిటీ పరంగా రన్ రాజా రన్ పెద్ద సినిమాలకి తీసిపోని విధంగా తెరకెక్కింది. డైరెక్టర్ సుజిత్‌కి మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉంది. రెగ్యులర్‌గా తెలుగు సినిమాల్లో చూసే కామెడీ కాకుండా అతను కొత్త రకంగా వినోదాన్ని పంచాడు. తన క్యారెక్టర్స్ అన్నిటినీ క్లియర్‌గా డెవలప్ చేసుకున్నాడు. కొత్తవాడైనా కానీ సినిమాని హ్యాండిల్ చేయడంలో తడబాటు కనిపించడం లేదు. తాను ఏం తీస్తున్నాననే క్లారిటీ ఉండడం వల్ల ట్విస్టులు వచ్చినపుడు కూడా గందరగోళం లేకుండా స్పష్టంగా కథ చెప్పగలిగాడు. ఇటీవల సక్సెస్ అయిన కొత్త దర్శకుల జాబితాలో ఇతనూ చేరతాడు. ఇకపై ఎలాంటి సినిమాలు తీస్తాడనేది ఆసక్తికరం.
విశ్లేషణ: ‘రన్ రాజా రన్’ అవుట్ అండ్ అవుట్ ఫన్ ఫిలిం. స్టార్ట్ టు ఎండ్ ఎంటర్‌టైన్‌మెంట్ మిస్ అవకుండా సరదాగా సాగిపోతుంది. ఏ దశలోను ఈ సినిమా సీరియస్‌గా మారదు. బేసిక్‌గా యాక్షన్‌కి స్కోప్ ఎక్కువ ఉన్నా కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా భారీ ఫైట్ లేకపోవడం ఈ సినిమా స్పెషాలిటీ. సిట్యువేషన్స్‌ని సింపుల్‌గా, కూల్‌గా ఎలా డీల్ చేయాలో దర్శకుడు తన పాత్రల ద్వారా చూపించాడు. క్యారెక్టర్స్‌ని పరిచయం చేయడంతోనే వాటికో ఫన్నీ యాంగిల్ కూడా ఇచ్చి సదరు పాత్రలపై సీరియస్ ఇంప్రెషన్ కలగకుండా చూసుకున్నాడు. ఉదాహరణకి కమీషనర్ క్యారెక్టర్ మైఖేల్ జాక్సన్ సాంగ్ ప్లే అవుతుంటే డాన్స్ వేస్తూ ఇంట్రడ్యూస్ అవుతుంది. దాని వల్ల ఆ తర్వాత ఆ పాత్రని కూడా వినోదానికి వాడుకోవడానికి వీలు చిక్కింది. అదే ఈ క్యారెక్టర్‌ని ఏ ఎన్‌కౌంటర్ చేస్తున్నట్టో.. ఎవర్నో ఇంటరాగేట్ చేస్తున్నట్టో చూపించి ఉంటే.. ఆ తర్వాత ఆ పాత్రని కామెడీగా మలచడం ఇబ్బంది అయ్యేది. దర్శకుడు ఇలాంటి సింపుల్ విషయాలపై శ్రద్ధ పెట్టాడు. ప్రథమార్థం సాఫీగా ఒక రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లా సాగిపోతుంది. ఇంటర్వెల్ తర్వాత కథలో సడన్ టర్న్ వస్తుంది. యాక్షన్ పెరుగుతుంది. అయితే ఎంటర్‌టైన్‌మెంట్‌ని మాత్రం ఎక్కడా మిస్ అవలేదు. అసలు కథని ప్రీ క్లయిమాక్స్‌లో రివీల్ చేస్తారు. ఎంటర్‌టైనర్స్ అంటే అసలు కథే లేని డొల్లతనం ఎక్కువవుతోంది. కానీ ఈ చిత్రంలో ఆ లోటు లేకుండా విషయమున్న కథనే రాసుకున్నారు. అయితే ఆ ట్విస్టులు మరీ ఎక్కువయ్యాయేమో అనిపిస్తాయి. ఒక దాని తర్వాత ఒకటిగా చాలా విషయాలు ఒకేసారి రివీల్ అయిపోవడం వల్ల కథనం కాసేపు బరువెక్కుతుంది. అయితే మళ్లీ క్లయిమాక్స్‌లో యథాతథంగా ఫన్ నింపేసి హ్యాపీగా పంపేసారనుకోండి. ఈ చిత్రం ప్రధానంగా యూత్‌ని, సిటీ ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా ఉంది. మసాలా ఎలిమెంట్స్ కానీ, మాస్ కోరుకునే అంశాలు కానీ ఇందులో లేవు. కనుక ‘రన్ రాజా రన్’ మెయిన్‌గా ఏ సెంటర్స్‌కి పరిమితం అయ్యే అవకాశముంది. శర్వానంద్‌కి చాలా కాలంగా దక్కకుండా పోతున్న సక్సెస్ ఈసారి రన్ రాజాతో కైవసం అయినట్టే. రొటీన్ కామెడీ నుంచి బ్రేక్ కోరుకుంటోన్న వారిని, ఒక డిఫరెంట్ ఎంటర్‌టైనర్ కోరుకునే వారిని ఈ చిత్రం డిజప్పాయింట్ చేయదు.
బోటమ్ లైన్: ఫన్ రాజా ఫన్!
REVIEW @ MEGA CREATIONS-G.S.KUMAR

Friday, 25 July 2014
5వేల థియేటర్లలొ కిక్ ఇవ్వనున్న సల్లూభాయ్
బాలీవుడ్ ‘కిక్’ ఐదు వేల థియేటర్లలో విడుదల కానుంది. భారతదేశంలోనే అత్యధిక థియేటర్లలో సినిమాని విడుదల చేస్తోన్న చిత్ర నిర్మాతలు, విదేశాల్లోనూ కనీ వినీ ఎరుగని రీతిలో ఈ సినిమాని అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. మామూలుగా అమెరికా తదితర దేశాల్లోనే ఎక్కువగా మన సినిమాలు విడుదలవుతుంటాయి. ఈసారి ‘కిక్’ని జర్మనీ, మొరాకో, ఫ్రాన్స్, మాల్దీవుల్లోనూ విడుదల చేస్తుండడం గమనార్హం. తెలుగులో రవితేజ, ఇలియానా జంటగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘కిక్’ సినిమానే హిందీలో సల్మాన్‌ఖాన్ హీరోగా అదే పేరుతో రీమేక్ చేసిన విషయం విదితమే. సల్మాన్‌ఖాన్ సరసన శ్రీలంక బ్యూటీ జాక్వెలైన్ ఫెర్నాండెజ్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. భారీ బడ్జెట్‌తో, తెలుగు ‘కిక్’ కన్నా పదింతల కిక్ ఇచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించారట. సాజిద్ నడియడ్‌వాలా ఈ హిందీ ‘కిక్’ చిత్రానికి దర్శకుడు. తొలిరోజు, తొలివారం రికార్డుల్ని ఇంకెవరూ ఇప్పట్లో టచ్ చేయని రీతిలో ‘కిక్’ క్రియేట్ చేస్తుందన్నది చిత్ర యూనిట్ నమ్మకం. మొత్తం 42 దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండడంతో రికార్డులు ఏ రేంజ్‌లో వుంటారో ఊహించడమే కష్టమని బాలీవుడ్ సినీ జనం అనుకుంటున్నారట.
Wednesday, 23 July 2014
Ram Charan to launch Turbo Megha Airlines
Mega Power Star Ram Charan Tej going to enter into airline business. He already got permission from Union ministry of aviation to run airlines with a name, Turbo Megha. Ram Charan and Vankayalapati Umesh are the directors of this company. Ram Charan's Turbo Megha is one of the eight airlines, which got permissions from the Union government.
Out of these eight airlines, three airlines run national and international services and the remaining five airlines are regional and they run services in domestic sector.
Out of these eight airlines, three airlines run national and international services and the remaining five airlines are regional and they run services in domestic sector.
Friday, 18 July 2014
Thursday, 17 July 2014
రీలీజ్ కి ముందె కనకవర్షం కురుపిస్తున్న చెర్రి
రామ్ చరణ్,కృష్ణ వంశీ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘గోవిందుడు అందరివాడేలే’ . టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రం బిజినెస్ షాకింగ్ కు గురి చేస్తూ ఓ రేంజిలో జరుగుతోంది. ఇప్పటివరకూ ఈ చిత్రం గురించి ఏ విషయం రివిల్ చేయకపోయినా బయ్యిర్లు,డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. రికార్డు రేట్లకు దాదాపు చాలా ఏరియాల బిజినెస్ క్లోజ్ అయిపోయినట్లు సమాచారం. ఈ బిజినెస్ చూసిన వాళ్ళు…అందుకే నిర్మాతలు మెగా హీరోలు వెంట నిర్మాతలు పడతారు అంటున్నారు. ఆ డిస్ట్రిబ్యూటర్స్ లిస్టు ఇదిగో… నైజాం ఏరియా- దిల్ రాజు సీడెడ్ – లక్ష్మీ కాంత్ రెడ్డి వైజాగ్- భరత్ పిక్చర్స్ నెల్లూరు- హరి పిక్చర్స్
Subscribe to:
Posts (Atom)